టీడీపీకి నీటి గండం

nellore
Spread the love

తెలుగుదేశం పార్టీలో కొత్త తగాదా తెరమీదకు వచ్చింది. నెల్లూరు టీడీపీలో జలజగడం కలకలం రేపుతోంది. ఓవైపు మంత్రి సోమిరెడ్డి మరోవైపు ఎమ్మెల్యే పోలంరెడ్డి మధ్య పోరు తీవ్రంగా సాగుతున్న సమయంలో వివాదం ఎటు మళ్లుతుందోననే చర్చ సాగుతోంది. మధ్యలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్యవర్తిత్వం నడిపినా ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎదురుతిరగడం వివాదం ముదురడానికి కారణంగా మారింది.ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ విభజన వ్యవహారంతో రసకందాయంలో పడింది.

రెండు సబ్‌ డివిజన్లుగా విభజిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. బుచ్చిరెడ్డిపాళెం సబ్‌ డివిజన్‌ పరిధిలోని సాగు భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సబ్‌ డివిజన్ల పునర్విభజన చేయాలని అంతా కలిసి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా మంత్రి సోమిరెడ్డి కసరత్తు చేశారు. ఇరిగేషన్‌ సబ్‌ డివి జన్‌ను రెండుగా విభజించారు. బుచ్చి రెడ్డిపాళెం సబ్‌ డివిజన్‌లో ఉండే కొడవలూరు, విడవలూరు మండలాలను కోవూరు మండలంలో కలిపారు. దీనిపై రైతు సంఘాలు అప్పటికే అభ్యంతరం లేవనెత్తి ముఖ్యమంత్రికి లేఖలు రాశాయి. విభజన పేరుతో కొడవలూరు మండలంలోని ఇఫ్కోకు కనిగిరి రిజర్వాయర్‌ నుంచి 10 ఎంజీడీ నీటిని కేటాయించారు. కోకో కోలా సంస్థకు 8 నుంచి 9 టీఎంసీల నీటిని విక్రయించడానికి వీలుగా ఒప్పందాలు చేశారు. దీనివల్ల కనిగిరి రిజర్వాయర్‌ కింద ఉన్న 1.48 లక్షల ఎకరాల భూమిలో సాగుకు విఘాతం కలుగుతుందనేది రైతు సంఘాల వాదన.

ముందుగా విభజనకు మంత్రి సోమిరెడ్డి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ అంగీకరించారు. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే విభజన సరికాదనడంపై చర్చ మొదలైంది. అధికార పార్టీలో ఆధిపత్యం నేపథ్యంలోనే ముఖ్యుల మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ ప్రభావం కెనాల్‌ సబ్‌డివిజన్‌ పునర్విభజనపై పడటంతో గందరగోళం మొదలైంది. తెలుగుతమ్ముళ్లకు తలనొప్పిగా మారింది. పోలవరం రెడ్డి పట్టు వీడకపోవడంతో మంత్రి సొమిరెడ్డికి చిక్కుగా మారినట్టు కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ నేతలే తన మాట వినకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అయినా ఫలితం దక్కకపోవడంతో సమస్య ఎటు మళ్లుతుందోననే ఆసక్తి రేగుతోంది.


Related News

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the loveటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

hqdefault

రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం

Spread the loveఏపీలో అధికార పార్టీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారికితోడుగా మిత్రపక్షం నేతలు కూడా కలుస్తున్నారు.Read More

 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
 • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
 • మళ్లీ కొట్టుకున్నారు..
 • ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *