టీడీపీ నుంచి వైసీపీలోకి మాజీ ఎంపీ

ycp
Spread the love

వైసీపీ లో మళ్లీ జాయినింగ్స్ పర్వం మొదలయ్యింది. గడిచిన కొన్నాళ్లుగా దానికి బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా నంద్యాల ఎన్నికల ఫలితాల తర్వాత కొంత సందిగ్ధం కనిపించింది. కానీ ఇప్పుడు మరోసారి పలువరు నేతలు జగన్ సమక్షంలో కండువాలు కప్పుకునే కార్యక్రమానికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వచ్చే నవంబర్ నెల మొదటి వారంలో పాదయాత్రకు సిద్ధం కాబోతున్న నేపథ్యంలో చేరికలు ఖాయంగా కనిపిస్తోంది.

తాజాగా వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో బాపట్ల మాజీ ఎంపీ చిమటా సాంబు పార్టీ కండువా కప్పుకున్నారు. జగన్ ఆయన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మాజీ పీడీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ గడ్డం శ్రీనివాసరావు, టీడీపీ వేటపాలెం మండల మాజీ నేతలు పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఈ చేరికలు కొంత తోడ్పడతాయని భావిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు వైసీపీలో ఏమేరకు న్యాయం జరుగుతుందో చూడాలి.


Related News

1736_ysrcp

వ‌ర్గ‌పోరుతో వైసీపీ స‌త‌మ‌తం

Spread the loveఏపీలో పాల‌క‌ప‌క్షంలో విబేధాలు ఇప్ప‌టికే పెను వివాదాల‌కు దారితీస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌కాశం జిల్లా అద్దంకి త‌గాదా ఇప్ప‌టికీRead More

TDP-flags-AFP

టీడీపీకి యువ నేత రాజీనామా

Spread the loveనెల్లూరు జిల్లా రాజకీయాల్లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. జగన్ పాదయాత్ర జిల్లాలో ప్రవేశించడంతో కదలికలు మొదలవుతున్నాయి. పలువురుRead More

 • టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్
 • వైసీపీలో ముదురుతున్న విబేధాలు
 • టీడీపీలో కలకలం కేసులో మేయర్
 • రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం
 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *