Main Menu

టీడీపీకి యువ నేత రాజీనామా

TDP-flags-AFP
Spread the love

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. జగన్ పాదయాత్ర జిల్లాలో ప్రవేశించడంతో కదలికలు మొదలవుతున్నాయి. పలువురు ఫిరాయింపులకు సన్నద్ధమవుతున్నారు. తాజాగా జెడ్పీలో టీడీపీ పక్ష నాయకుడి తనయుడు తెరమీదకు వచ్చారు. టీడీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ వేనా టి రామచంద్రారెడ్డి తనయుడు, సూళ్లూరుపేట మున్సిపాల్టీ 13వ వార్డు కౌన్సిలర్‌ వేనాటి సుమంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీకి నష్టం కలిగించడమే కాకుండా, ఆయన నాయకత్వంలో కొందరు యువత వైసీపీలో చేరుతుండడం పచ్చదండులో అసహనం రాజేస్తోంది.

వీలైనంత త్వరలో తన అనుచర వర్గంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని చెప్పారు. సూళ్లూరుపేట మున్సిపాల్టీ వైస్‌ చైర్మన్‌ పదవిని వదులుకొని పార్టీని గెలిపించుకున్నామని, అయితే అక్కడ జరుగుతున్న పాలనా వ్యవహారాల్లో నాయకుల మధ్య విభేదాలతో నిధులు వెనక్కి వెళ్లిపోవడం తన మనస్సును కలిచివేసిందన్నారు. రూ.150 కోట్లతో సూళ్లూరుపేట పట్టణ దాహార్తిని తీర్చేందుకు తాను యత్నిస్తే నాయకుల మధ్య విభేదాలతో పథకం నీరుగారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రకు విశేషాదరణ లభిస్తోందని, జగనన్న సీఎం కావడం తథ్యమని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే సూళ్లూరుపేట అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.






Related News

9173_ysrcp-3

వైసీపీ తెర‌మీద‌కు కొత్త నేత‌లు

Spread the loveవైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. రాజ‌కీయంగా జ‌గ‌న్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ల విష‌యంలోRead More

07-1457330006-28-anam-ramanarayana-reddy-600

లైన్ క్లియ‌ర్ చేస‌కున్న ఆనం

Spread the loveమాజీ మంత్రి ఆనం రామ‌నారాయణ రెడ్డికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆయ‌న వైసీపీ లో చేర‌డడం ఖాయంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *