Main Menu

టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్న షాడో మంత్రి

Spread the love

ఏపీ టీడీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా ఓ షాడో మంత్రి క‌థ సీఎం వ‌ర‌కూ చేరింది. పూర్తి ఆధారాల‌తో నెల్లూరు జిల్లా టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేయ‌డంతో చంద్ర‌బాబు కూడా దృష్టి సారించిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. దాంతో మంత్రి నారాయ‌ణ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అవుతోంది

వ‌చ్చే ఎన్నిక‌ల్లో నారాయ‌ణ పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీ చేయ‌డం దాదాపుగా ఖాయం అయ్యింది. చంద్ర‌బాబు కూడా దానికి తగ్గ‌ట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. దాంతో ఈ సీటు మీద ఆశ‌పెట్టుకున్న ముంగ‌మూరి కృష్ణారెడ్డి మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నారు. త‌న‌కు అన్యాయం జ‌రుగుతోంద‌నే ఆందోళ‌న ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. ఈలోగా జిల్లాలో మంత్రి నారాయ‌ణ ప్ర‌ధాన అనుచ‌రుడు ఒక‌రు సాగిస్తున్న వ్య‌వ‌హారాల‌ను ఆయ‌న ముందుకు తెస్తున్నారు.

షాడో మంత్రి త‌ర‌హాలో అన్ని వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్న తీరును ఆధారాల‌తో టీడీపీ అధినేత‌కు స‌మ‌ర్పించారు. నియోజ‌క‌వ‌ర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న కృష్ణారెడ్డిని ప‌క్క‌న పెట్టి బ‌దిలీల నుంచి ఇత‌ర అన్ని వ్య‌వ‌హారాల్లోనూ షాడో మంత్రి దే కీల‌క‌పాత్ర‌గా మారింద‌ని చెబుతున్నారు. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల కార్యాల‌యం కేంద్రంగా చేసుకుని న‌డుపుతున్న తంతు పార్టీకిన‌ష్టం తెస్తుంద‌ని వాపోతున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం నారాయ‌ణ వ్య‌వ‌హారాల మీద సీరియ‌స్ గా దృష్టి పెట్టే అవ‌కాశాలు లేవ‌ని, అయినా కృష్ణారెడ్డి అనుచ‌రుల‌ను సంతృప్తి ప‌రిచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెప్పినట్టు నెల్లూరు నేత‌ల్లో చ‌ర్చ సాగుతుండ‌డం విశేషం.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *