Main Menu

బూచేపల్లికి బుజ్జగింపు

buchepalli
Spread the love

వైసీపీ నేతలు బుజ్జగింపు పనిలో పడ్డారు. ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కుటుంబాన్ని బుజ్జగించేందుకు నేరుగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రంగంలో దిగారు. ఒంగోలు చీమకుర్తిలోని మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో రాజకీయ మంతనాలు సాగించారు. దర్శి నియోజకవర్గ రాజకీయాలు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపధ్యంలో బూచేపల్లి కుటుంబంతో సుబ్బారెడ్డి జరిపిన మంతనాలపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇటీవల కాలంలో తాము రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా తాను రానున్న ఎన్నికల్లో పోటీచేయమని కూడా ప్రకటించారు. ఈనేపధ్యంలో నియోజకవర్గంలో వైకాపా తరపున చుక్కాని లేని నావలా తయారైంది. దీంతో ఆ నియోజకవర్గంలో ఇన్‌చార్జీగా బాదం మాధవరెడ్డి పేరు తెరపైకి వచ్చిన నేపధ్యంలో బూచేపల్లి కుటుంబంతో సుబ్బారెడ్డి సాగించిన మంతనాలు ఏమేరకు ఫలితాలిస్తాయో వేచిచూడాల్సి ఉంది. కాగా రానున్న ఎన్నికల్లో మీరే పోటీచేయాలని, లేనిపక్షంలో మీరు చూచించిన అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెడ్తామని సుబ్బారెడ్డి బూచేపల్లి కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈనేపధ్యంలో ఎంపి తన రాజకీయ మంత్రదండాన్ని ఉపయోగించి మళ్లీ బూచేపల్లికుటుంబాన్ని ఎన్నికల రణరంగంలోకి దించేందుకు కృషిచేస్తారో వేచిచూడాలి.






Related News

tdp

టీడీపీని వీడిపోతున్నా…!

Spread the loveతెలుగుదేశం పార్టీ నుంచి సీనియ‌ర్ నేత జారిపోవ‌డం ఖాయం అయ్యింది. గుర్తింపు లేని చోట తానుండలేన‌ని మాజీRead More

nellore

ఆ ఇద్దరూ అవుట్, టీడీపీలో కలవరం

Spread the loveతెలుగుదేశం పార్టీలో రానురాను సమస్యలు తీవ్రమవుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా సేఫ్ జోన్ చూసుకుంటుండడంతో పార్టీకి పెద్ద సమస్యగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *