ఉండ‌వ‌ల్లి, ద‌గ్గుపాటి క‌ల‌యిక వెనుక‌..!

123
Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో ఇదో ఆస‌క్తిక‌ర క‌ల‌యిక‌. ఎందుకంటే వాళ్లిద్ద‌రూ స‌హ‌చ‌రులు కాదు. ఇంకా చెప్పాలంటే చాలాకాలం పాటు విరోధులు కూడా. స‌మాకాలికులు అస‌లు కాదు. స‌మఉజ్జీలు కాదు. అయినా క‌లిశారు. మాజీలు కాస్త మ‌ళ్లీ క‌ల‌క‌లం రేపారు. గోదావ‌రి గ‌ట్టు మీద ఆస‌క్తిగా జ‌ట్టుక‌ట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు మాజీ మంత్రి. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు టీడీపీలో చ‌క్రం తిప్పిన పెద్ద‌ల్లుడు. కానీ చంద్ర‌బాబు సార‌ధ్యం వ‌హించిన త‌ర్వాత ఆయ‌న ప్రాభ‌వం కోల్పోయారు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరినా చివ‌ర‌కు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, చివ‌ర‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో క‌నిపించ‌కుండా పోయారు. ఉండ‌వ‌ల్లి సుదీర్ఘ‌కాలంగా కాంగ్రెస్ వాది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు స‌మైక్యాంధ్ర‌లో చేరినా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌కుండా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి దూర‌మ‌య్యారు. కానీ తాను రాజ‌కీయ నాయ‌కుడిన‌ని ఆయ‌న నిత్యం చెబుతూనే ఉంటారు. రాజ‌కీయాలు మాట్లాడుతూనే ఉంటారు.

ముఖ్యంగా ఇద్ద‌రికీ ఒక అంశంలో మాత్రం సారూప్య‌త ఉంది. ఇద్ద‌రికీ చంద్ర‌బాబు అంటే గిట్ట‌దు. తోడ‌ల్లుడితో ద‌గ్గుపాటికి కుటుంబ వ్య‌వ‌హారాల్లోనూ త‌గాదాలున్నాయి. చిర‌కాల రాజ‌కీయ పోరాటంలో చంద్ర‌బాబుతో ఉండ‌వ‌ల్లికి అనేక విబేధాలున్నాయి. బ‌హుశా ఈ క‌ల‌యికే ఇద్ద‌రినీ క‌లిపి ఉంటుంది. పోల‌వ‌రం, పురుషోత్త‌ప‌ట్నం వ‌ర‌కూ ప్ర‌యాణం చేయ‌డానికి తోడ్ప‌డి ఉంటుంది. ద‌గ్గుపాటి వ‌స్తాన‌న్నారు..అందుకే ఇద్ద‌రం క‌లిసి వ‌చ్చామ‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ఇద్ద‌రూ ఏపీ ప్ర‌భుత్వ తీరును దుయ్య‌బ‌ట్టారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ మూలంగా ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రుగుతోందంటూ ఉండ‌వ‌ల్లి వివ‌రించారు. కేంద్రంతో చంద్ర‌బాబు చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం స‌కాలంలో ప్రాజెక్ట్ పూర్తికాక‌పోతే ప్ర‌స్తుతం నాబార్డ్ ద్వారా అందుతున్న గ్రాంట్ల‌న్నీ అప్పులుగా మారిపోతాయ‌ని వివ‌రించారు. అంటే కేంద్రం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్ట్ ని, త‌న భుజాన వేసుకుని, ఇప్పుడు చెప్పిన స‌మ‌యానికి పూర్తిచేయ‌లేని స్థితిలో ప‌డుతూ ఏపీని అప్పులు ఊబిలో నెట్ట‌డానికి చంద్ర‌బాబు తీరు దోహ‌దం చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

ద‌గ్గుపాటి కూడా అంత నేరుగా, ఘాటుగా కాక‌పోయినా చంద్ర‌బాబు మీద ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు. రాజ‌కీయాల కోసం పోల‌వ‌రం రాలేద‌ని చెబుతూనే పోల‌వ‌రంలో ప‌రిస్థితి ఆశించిన‌ట్టుగా లేద‌ని వివ‌రించారు. క‌మీష‌న్ల కోస‌మే పోల‌వ‌రం బాధ్య‌త ఏపీ నెత్తిన పెట్టుకున్నార‌ని ఉండ‌వ‌ల్లి ఆరోపిస్తే ద‌గ్గుపాటి కూడా దాదాపుగా అలాంటి వ్యాఖ్య‌లే చేయ‌డం విశేషం. ఉండ‌వ‌ల్లి గోదావ‌రి తీరంలో ఇప్ప‌టికే పోల‌వ‌రం ఓ ప్ర‌ధాన అస్త్రంగా మార్చుకున్నారు. కానీ తాజాగా ద‌గ్గుపాటి జోక్యం వెనుక కూడా కార‌ణం లేక‌పోలేదు. ప్ర‌కాశం జిల్లాలో నీటిఎద్ద‌టి తీవ్రంగా ఉంది. అయినా పెండింగ్ ప్రాజెక్టుల సంగ‌తి చంద్ర‌బాబు మ‌ర‌చిపోయారు. పోల‌వ‌రంతో స‌ర్వాంత‌ర్యామి అని చెబుతున్నారు. మ‌రో అడుగు ముందుకేసి పెన్నా న‌దితో అనుసంధానం కూడా అంటున్నారు. ఈ నేప‌థ్యంలో పోల‌వ‌రం ప‌రిస్థితి, ప‌ట్టిసీమ వ‌ల్ల ప్ర‌కాశం జిల్లాకు ఒరిగిందేమిటనే ప్ర‌శ్న‌లు రాజేయ‌డం ద్వారా ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో నెట్ట‌డానికి ద‌గ్గుపాటికి బోలెడు అవ‌కాశాలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప‌నిగట్టుకుని గోదావ‌రి తీరంలో అడుగుపెట్టి ఉంటార‌ని భావిస్తున్నారు. మొత్తంగా ప్ర‌కాశం జిల్లా ద‌గ్గుపాటి, గోదావ‌రి జిల్లా ఉండ‌వ‌ల్లి క‌లిసి పోల‌వ‌రంలో రాజేసిన మంట అంత త్వ‌ర‌గా చ‌ల్లారే అవ‌కాశం లేదు. వీరి జోడి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని అంశాల మీద క‌లిసి ప‌నిచేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌ధాని స‌హా ప‌లు కీల‌కాంశాల‌ను క‌లిసొచ్చేవాళ్లంద‌రితో క‌లిసి ప్ర‌జ‌ల ముందు పెట్టాల‌నుకుంటున్న ఉండ‌వ‌ల్లికి ఓ తోడు దొరికిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇంకెలాంటి నిర్ణ‌యాలుంటాయో, ఎవరెవ‌రు చేతులు క‌లుపుతారో చూడాలి.


Related News

1736_ysrcp

వైసీపీలో ముదురుతున్న విబేధాలు

Spread the love5Sharesవైసీపీకి పట్టున్న జిల్లాల్లో రాయలసీమ తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలే కనిపిస్తాయి. గడిచిన ఎన్నికల్లో కొన్ని సీట్లుRead More

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the love2Sharesటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

 • రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం
 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
 • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
 • మళ్లీ కొట్టుకున్నారు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *