పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్

pawantt_4127
Spread the love

జనసేన అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహారం ఒకటి బయటపెట్టారు. తనకు కమలనాధుల నుంచి వచ్చిన ఆఫర్ గురించి చెప్పుకొచ్చారు. అయితే దానిని తాను తిరస్కరించినట్టు చెప్పడం విశేషం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకు హైదరాబాదులో అమిత్ షా తనను కలిసినట్టు పవన్ తెలిపారు. ఆ సందర్భంగా ఆయన తనతో మాట్లాడుతూ, ఇకపై దేశ భవిష్యత్తు ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉండదని, కేవలం జాతీయ పార్టీల చేతుల్లోనే ఉండబోతోందని… అందువల్ల బీజేపీలో చేరాలంటూ తనతో చెప్పారని తెలిపారు. అవకాశవాద రాజకీయ నాయకుడిగా తనను అర్థం చేసుకున్నారని… కానీ, తాను అలాంటివాడిని కాదని అన్నారు.

అధికారం లేకపోయినా, పేరు ప్రఖ్యాతులను కోల్పోయినా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోనని కార్యకర్తలను ఉద్దేశించి పవన్ చెప్పారు. “అమిత్ షా సార్… నేను బీజేపీలోనే చేరాలనుకుంటే జనసేనను ఎందుకు స్థాపిస్తాను?” అంటూ సభావేదిక నుంచి ప్రశ్నించారు. జాతీయ పార్టీలు చాలా బలంగా పని చేస్తే… ప్రాంతీయ పార్టీల అవసరమే లేదని అన్నారు. లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉండవచ్చు, కానీ ఏపీ నుంచి బీజేపీ తరపున ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు కూడా గెలిచారన్న విషయాన్ని మర్చి పోరాదని… కేంద్రంలో నెంబర్ గేమ్ ఎంత డేంజరస్ గా ఉంటుందో అనే విషయాన్ని మర్చి పోరాదని సూచించారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. దాంతో బీజేపీని పవన్ హెచ్చరించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.


Related News

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the loveటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

hqdefault

రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం

Spread the loveఏపీలో అధికార పార్టీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారికితోడుగా మిత్రపక్షం నేతలు కూడా కలుస్తున్నారు.Read More

 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
 • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
 • మళ్లీ కొట్టుకున్నారు..
 • ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *