Main Menu

తెలుగు తమ్ముళ్ల త‌గాదాలో ద‌గ్గుబాటికి క‌లిసొచ్చేనా?

Spread the love

తెలుగుతమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయి చేరుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టిసారించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుపై తెలుగుతమ్ముళ్లు బాహాటంగానే విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. పాతతరం నాయకులను కాదని కొత్తతరం వారికి ఏలూరి అధికప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని సీనియర్ నాయకురు నాయుడమ్మ, కొల్లా సుభాష్ బహిరంగంగానే ఏలూరిపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పర్చూరు నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి గళం ఒక్కసారిగా తెరపైకి రావటంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఇటీవల రామాయపట్నం జన్మభూమి సభకు ముఖ్యమంత్రి హాజరైన సందర్బంలోను జిల్లాలోని అసమ్మతి నేతలను బుజ్జగించి రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ముఖ్యనాయకులకు సూచించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఇటీవల జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి నారాయణ, జిల్లామంత్రి శిద్దా రాఘవరావుతోపాటు పలువురు ముఖ్యనాయకులు సమావేశం కావటం జరిగింది. జిల్లాలోని పలునియోజకవర్గాల్లో ఉన్న తలనొప్పులే కాకుండా కొత్తగా పర్చూరు నియోజకవర్గంలో అసమ్మతి గళం వినిపిస్తుండటంతో పార్టీకి కొత్తసమస్య వచ్చిపడినట్లైంది. రానున్న ఎన్నికల్లో శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుకు నియోజకవర్గంలోని తెలుగుతమ్ముళ్లు పూర్తిస్థాయిలో సహకరిస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది.

ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీచేసినప్పటికి ఎన్నికల సమయం కావటంతో ఆయన ఆదేశాలను సైతం నేతలు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నారు. ఇటీవల కాలంలో సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బిఎన్ విజయకుమార్‌పై ఆయన వ్యతిరేక వర్గం అసమ్మతి గళం వినిపించింది. విజయకుమార్‌తోపాటు, ఆయన వ్యతిరేకవర్గం ఇటీవల ఘర్షణకు కూడా దిగిన సందర్భాలు జరిగింది. ఈ నేపధ్యంలో సంతనూతలపాడు నియోజకవర్గంలోను రోజురోజుకు తెలుగుతమ్ముళ్ల అసమ్మతిరాగం పేట్రేగిపోతుందని చెప్పవచ్చు. మొత్తంమీద రానున్న ఎన్నికల్లో శాసనసభ్యులు ఏలూరికి సీనియర్లు సహకరిస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది






Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *