ఒంగోలు వైసీపీలో కొత్త చ‌రిత్ర‌

jagan-yvsubbareddy-20-1461133556
Spread the love

భిన్న ధృవాలు ఏక‌మ‌యిన‌ట్టే క‌నిపించింది. ప‌చ్చ‌గ‌డ్డ వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో క‌నిపించిన వైరం స‌మ‌సిపోయిన‌ట్టేనా అనిపిస్తోంది. ఈ ఇద్ద‌రు నేత‌లు ఒక్క‌టి కావ‌డం ఇప్పుడు ఒంగోలు లో హాట్ టాపిక్ గా మారింది. ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆయన బావమరిది వైసిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్క‌టికావ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. నిత్యం క‌త్తులు దూసుకుంటే, ఒకే పార్టీలో రెండు వ‌ర్గాలుగా క‌నిపించిన నేత‌లు క‌లిసి సాగుతున్న వైనం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. నిత్యం ఘ‌ర్ష‌ణ‌ల‌తో న‌ష్ట‌పోయిన నేత‌లు ఎట్ట‌కేల‌కు క‌ళ్లు తెరిచారా అన్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ప్ర‌కాశం జిల్లా వైసీపీకి ఇది శుభ‌ప‌రిణామంగా భావిస్తున్నారు.

ఈబావబావమరుదులు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా, ఇద్దరు సఖ్యతగా మాట్లాడుకుంటుండటంతో పార్టీ కార్యకర్తలకు సంతృప్తిక‌రంగా క‌నిపిస్తోంది. దీంతో పార్టీ జిల్లాలో మరింత ముందుకు పోతుందన్న చర్చ పార్టీశ్రేణులనుండి వినిపిస్తోంది. ఇటీవల జిల్లావైసిపి ప్లీనరీ సమావేశం ఒంగోలులో భారీగా జరిగింది. ఈప్లీనరీలో బావబావమరుదులు ఇద్దరు ఒక్కటిగా కుర్చోని మాట్లాడుకోవటమేకాదు, పలు జిల్లాఅంశాలపై చర్చించి తీర్మానాలు చేయటం జరిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించిన కొంతమంది నేతలకు మాట్లాడే అవకాశాన్ని కూడా బాలినేని తగ్గించినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. అదేవిధంగా గతంలో జరిగిన యర్రగొండపాలెంతోపాటు, ఇతర సభల్లోను బావబావమరుదులు ఇద్దరు ఒకే వేదికపై ఉండి మేం ఇద్దరం ఒకటే అన్న సంకేతాలను పార్టీశ్రేణులకు పంపించారు.

మ‌రోవైపు రానున్న ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల తరుపున పోటీచేసే అభ్యర్థుల విషయంలో వైవి బాలినేని కలిసి ఒకే అంటేనే అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఆమోదముద్ర వేసే అవకాశం ఉండడంతో ఇకపై ఇద్దరితోను చర్చించాల్సి ఉంది. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో ఎంపి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లోను వీరిద్దరు పాల్గొననున్నారు. మొత్తంమీద బావబావమరుదులు ఇద్దరు తరుచుగా పోన్లల్లో జిల్లా రాజకీయాలతోపాటు, పలుకుటుంబ అంశాలపై కూడా చర్చించుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు వీరిద్దరి మధ్య పబ్బంగడుపుకునే నేతలకు చెక్‌పడినట్లైంది.

అయితే అంత‌దూరంలో ఎడ‌మొఖం , పెడ‌మొఖంగా ఉన్న‌వాళ్లు హ‌ఠాత్తుగా క‌లిసిపోయి కొత్త చ‌రిత్ర సృష్టించ‌డానికి కార‌ణాలేంటా అని ప‌లువురు చ‌ర్చించుకుంటుండడ‌డం విశేషం. ముఖ్యంగా పార్టీ అధిష్టానం ఇద్ద‌రికీ గ‌ట్టిగా క్లాస్ పీక‌డ‌మే కాకుండా, జిల్లాలో పార్టీ భ‌విష్య‌త్తు, త‌మ భ‌విష్య‌త్తు ఊహించుకున్న నేత‌లు చెరో మెట్టు దిగ‌డంతోనే స‌మ‌స్య స‌ర్థుమ‌ణిగింద‌నే అంచ‌నాలున్నాయి. మొత్తంగా కార‌ణాలేమ‌యినా వైవీ, బాలినేని బంధం బ‌ల‌ప‌డితే అది వారి పార్టీకి మేలు చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.


Related News

YV SUBBAREDDY

వైసీపీ ఎంపీ కి చేదు అనుభవం

Spread the loveప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమకు రావాల్సిన వేతనాలు రాకుండా చేసిRead More

ycp

టీడీపీ నుంచి వైసీపీలోకి మాజీ ఎంపీ

Spread the loveవైసీపీ లో మళ్లీ జాయినింగ్స్ పర్వం మొదలయ్యింది. గడిచిన కొన్నాళ్లుగా దానికి బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా నంద్యాలRead More

 • ఆ సీటుకి క్యాండిడేట్ ఖాయం చేసిన జగన్
 • వివాదాస్పదంగా మారుతున్న గంటా
 • సీబీఐ చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే
 • అవునా..సోమిరెడ్డిని నిలదీస్తే శిక్షా?
 • జగన్ కి జ్వరమొచ్చింది
 • వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్
 • ఎమ్మెల్యే గారి పెళ్లి
 • టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన గ్రామస్తులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *