నంద్యాల‌ జిల్లా కేంద్రం: రాష్ట్రంలో 25 జిల్లాలు

jagan
Spread the love

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మార్పున‌కు నంద్యాల నాంది కాబోతోంద‌ని వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. మ‌హాకురుక్షేత్రానికి తొలిమెట్టు కాబోతోంద‌న్నారు. నంద్యాల అభివృద్ధి బాధ్య‌త త‌న‌దేన‌న్నారు. విత్త‌నాల‌కు, వ్య‌వ‌సాయానికి నంద్యాల కేంద్రం అవుతుంద‌న్నారు. వ్య‌వ‌సాయ యూనివ‌ర్సిటీ పెడ‌తామ‌న్నారు. కుందూన‌ది ఉన్న నంద్యాల క‌ష్టం త‌న‌కు తెలుస‌న్నారు. కుందూన‌దిని ప్ర‌క్షాళ‌న చేసే బాధ్య‌త త‌న‌దేన‌న్నారు. నంద్యాల మోడ‌ల్ టౌన్ గా మార్చేస్తాన‌ని వైఎస్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

తాను ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు రాష్ట్ర చ‌రిత్ర‌ను మార్చ‌బోతున్నాయ‌న్నారు. ఎటువంటి వివ‌క్ష లేకుండా అంద‌రికీ న‌వ‌ర‌త్నాలు అందిస్తామ‌న్నారు. వాటిని అంద‌రికీ అందించ‌డానికి వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేస్తామ‌న్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా అధికారంలోకి రాగానే ప్ర‌తీ పార్ల‌మెంట్ ను ఒక జిల్లాగా మార్చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 13 జిల్లాల‌ను 25 జిల్లాలుగా మార్చేస్తామ‌న్నారు. నంద్యాల జిల్లాకు నంద్యాల‌ను కేంద్రంగా ప్ర‌క‌టిస్తూ అధికారంలోకి రాగానే మార్చేస్తామ‌న్నారు.

ప్ర‌తీ పేద‌వాడికి ఉచితంగా ఇల్లు క‌ట్టిస్తామ‌న్నారు. ఆర్య‌వైశ్య కార్పోరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. నంద్యాల‌లో రోడ్ల విస్త‌ర‌ణ‌తో న‌ష్ట‌పోయిన వారంద‌రికీ ప‌రిహారం చెల్లిస్తామ‌న్నారు. 2019 కురుక్షేత్రానికి ముందే ఎమ్మెల్సీగా 2018లో నంద్యాల నుంచి మైనార్టీల‌కు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కేశ‌వ‌రెడ్డి బాధితుల‌కు న్యాయం చేస్తూ చంద్ర‌బాబు చొక్కా, ఆదినారాయ‌ణ రెడ్డి నిక్క‌రు వ‌దిలిస్తామ‌న్నారు. 3 నెల‌ల్లోనే అగ్రిగోల్డ్, కేశ‌వ‌రెడ్డి బాధితుల‌కు స‌హాయం అందిస్తామ‌న్నారు. నంద్యాల నుంచి వైసీపీకి ఆశీస్సులందాలన్నారు.

చంద్ర‌బాబు మాదిరి రాజ‌కీయాలు చేయ‌డం త‌న‌వ‌ల్ల కాద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అందుకే క‌లియుగ రాక్ష‌సుడిని హ‌త‌మార్చడానికి అంద‌రూ స‌వ్య‌శాచి కావాల‌న్నారు. శిల్పా చ‌క్ర‌పాణి కి చెప్ప‌గానే రాజీనామా చేసి టీడీపీ ద్వారా వ‌చ్చిన ప‌ద‌విని ఆయ‌న మొఖాన కొట్టి వ‌చ్చార‌న్నారు. శిల్పా మోహ‌న్ రెడ్డిని గెలిపించాల‌ని ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.


Related News

dsbv swamy kondepi

ఎమ్మెల్యే గారి పెళ్లి

Spread the love6Sharesఎమ్మెల్యే గారు పెళ్లి కొడుకయ్యారు. డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కొండెపిRead More

bollineni ramarao

టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన గ్రామస్తులు

Spread the love13Sharesటీడీపీ ఎమ్మెల్యేల తీరు రానురాను వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా ఉదయ‌గిరి ఎమ్మెల్యే తీరును ఆయ‌న సొంతRead More

 • జ‌గ‌న్ ని పొగిడి, బాబుని తెగిడిన టీడీపీ ఎంపీ
 • ఉండ‌వ‌ల్లి, ద‌గ్గుపాటి క‌ల‌యిక వెనుక‌..!
 • గిద్ద‌లూరు టీడీపీ క‌ట్ట‌లు తెంచుకుంది..!
 • ఆప‌రేష‌న్ ప్ర‌కాశం ప్రారంభించిన వైసీపీ
 • నంద్యాల‌ జిల్లా కేంద్రం: రాష్ట్రంలో 25 జిల్లాలు
 • ఒంగోలు వైసీపీలో కొత్త చ‌రిత్ర‌
 • చంద్ర‌బాబు కోపం వ‌చ్చింది..!
 • అద్దంకిలో మ‌ళ్లీ రాజుకున్న చిచ్చు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *