Main Menu

టీడీపీ అభ్య‌ర్థులు ఖ‌రారు

Spread the love

చంద్ర‌బాబు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. గ‌తానికి భిన్నంగా సాగుతున్నారు. ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ చివ‌రిలో చిక్కులు తెచ్చుకోవ‌డం క‌న్నా ముందు నుంచే స్ప‌ష్ట‌త తో సాగాల‌ని చూస్తున్నారు. దానికి తగ్గ‌ట్టుగానే నెల్లూరు జిల్లా వ్య‌వ‌హారాల్లో క్లారిటీ ఇచ్చేస్తున్నారు. జిల్లాలోని ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు సీట్లు ఖాయం చేశారు.

వారిలో వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ‌, ఉద‌య‌గిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస‌రెడ్డి ఉన్నారు. వారితో పాటుగా ఇద్ద‌రు మంత్రుల‌కు దాదాపుగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మ‌రోసారి స‌ర్వేప‌ల్లి నుంచి రంగంలో దిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నాలుగు సార్లు ఓట‌మి పాల‌యిన సీటులో మ‌రో అవ‌కాశం ఇచ్చేందుకు చంద్ర‌బాబు సుముఖంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు.

మ‌రో మంత్రి నారాయ‌ణ కోరిక మేర‌కు నెల్లూరు సిటీ సీటు ఆయ‌న‌కు ఖాయం అయ్యింది. అదే స‌మ‌యంలో సోమిరెడ్డి కి రాజకీయంగా విరోధిగా ఉన్న ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి అసెంబ్లీ ఆశ‌లు కూడా తీర్చేందుకు చంద్ర‌బాబు పూనుకుంటున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల జిల్లాలోని పార్టీ వ్య‌వ‌హారాల్లో ఆదాల కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వైసీపీ అసంతృప్తుల‌ను టీడీపీ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నంలో ఆయ‌న చొర‌వ చూపుతున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆదాల కోరుకుంటున్న‌ట్టుగా ఆయ‌న‌కు కావ‌లి ఎమ్మెల్యే సీటు ఖాయం అయ్యింద‌ని టీడీపీ నేత‌ల వాద‌న‌.

అదే స‌మ‌యంలో కావ‌లి సీటు మీద కొండంత ఆశ‌తో ఉన్న బీదా కుటుంబానికి ఈసారి నెల్లూరు ఎంపీ సీటు ఇస్తార‌ని స‌మాచారం. టీడీపీ త‌రుపున బీదా మ‌స్తాన్ రావు పార్ల‌మెంట్ సీటు కోసం పోటీ ప‌డ‌తార‌ని చెబుతున్నారు. దాంతో దాదాపుగా ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ సీటుకి అభ్య‌ర్థి ఖ‌రారు కావ‌డంతో నెల్లూరు టీడీపీ వ్య‌వ‌హారాల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టేన‌ని భావించ‌వ‌చ్చు.


Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *