Main Menu

ఆద‌ర‌ణ పెరిగినా అనిల్ కి అస‌లు ప‌రీక్ష అక్క‌డే..!

Spread the love

తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజ‌కీయాల అనుభ‌వం కూడా పెద్ద‌గా లేదు. అయినా అంద‌రిన నోళ్ల‌లో నానుతున్నారు. వాక్చాతుర్యంతో ప‌లువురి అభిమానాన్ని సంపాదించారు. అందుకే నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ చుట్టూ ఇప్పుడు ప‌లువురి దృష్టి ఉంది. తొలుత అసెంబ్లీలో ప్రైవేటు విద్యాసంస్థ‌ల మీద జ‌రిగిన చ‌ర్చ‌లో అనిల్ ఉప‌న్యాసం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆయ‌న మాట తీరు, స‌బ్జెక్ ప్ర‌జంటేష‌న్ ప‌లువురిని ఆక‌ట్టుకుంది. సీనియ‌ర్ ఎమ్మెల్యేల స్థాయిలో స‌భ‌లో అంద‌రినీ ఆలోచింప‌జేసిన ప్ర‌సంగం సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్ అయ్యింది.

వాస్త‌వానికి అనిల్ కుమార్ 29 ఏళ్ల‌కే ఎమ్మెల్యేగా ఎన్నిక‌యిన డాక్ట‌రేట్ ఉన్న నేత‌. ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీ ఉంచి డెంట‌ల్ స‌ర్జ‌రీలో బ్యాచిల‌ర్ డిగ్రీ సాధించారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు ప్రాధాన్య‌త‌నిస్తార‌నే పేరుంది. యూఎస్ లో గ‌డిపిన‌ప్ప‌టికీ నెల్లూరు వీధుల్లో కూడా అదే రీతిలో ఉంటార‌నే అబిప్రాయం వినిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆ త‌ర్వాత అనేక ప‌రిణామాలు జ‌రిగిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద అనిల్ చేసిన కామెంట్స్ తీవ్రంగా క‌ల‌వ‌రం రేపాయి. వైసీపీ శ్రేణులు, జ‌గ‌న్ అభిమానుల్లో ఇప్పుడు అనిల్ ఓ ఫైర్ బ్రాండ్ గా మారారు. ఇప్ప‌టికే రోజా వంటి వారి విమ‌ర్శ‌లు వారికి ఊర‌ట నిస్తుండ‌గా, అనిల్ పంచ్ లు, అబిన‌యంతో మాట్లాడిన తీరు సంతృప్తి ప‌రిచింది. దాంతో అనిల్ కి రాష్ట్ర‌మంతా అబిమానులు పెరిగార‌నే చెప్ప‌వ‌చ్చు.

అయితే నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో అనిల్ ఈసారి బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఢీ కొట్ట‌బోతున్నారు. ఏపీ మంత్రి, కార్పోరేట్ విద్యాసంస్థ‌ల అధినేత నారాయ‌ణ నేరుగా రంగంలో దిగుతున్నారు. ఇరు పార్టీల అభ్య‌ర్థిత్వాలు ఖారారు కావ‌డంతో నేత‌లంతా సొంత నియోజ‌క‌వ‌ర్గాల‌లో స‌ర్థుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నారాయ‌ణ కూడా ఏపీ వ్య‌వ‌హారాలు, అమ‌రావ‌తి విష‌యాల క‌న్నా నెల్లూరు రాజ‌కీయాల‌కే ప్రాధాన్య‌త‌నిస్తూ ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. దాంతో ఇప్పుడు అనిల్ కి అస‌లైన ప‌రీక్ష ఎదురుకాబోతోంది.

ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఆయ‌న ప‌నితీరుకి ప్ర‌జ‌లు మార్కులు వేయ‌బోతున్నారు. దాంతో ఇప్పుడు మ‌రోసారి ప్ర‌జాద‌ర‌ణ నిల‌బెట్టుకోవ‌డం క‌ఠిన ప‌రీక్ష అవుతుంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ నారాయ‌ణ వంటి స్థిర‌మైన నేత‌ను ఢీ కొట్ట‌డం అనిల్ కి క‌త్తిమీద సాములా మార‌బోతోంది దాంతో నెల్లూరు వ్య‌వ‌హారాలు ఇప్పుడు ఏపీ న‌లుచెరుగులా ఆస‌క్తిని రాజేస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *