టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన గ్రామస్తులు

bollineni ramarao
Spread the love

టీడీపీ ఎమ్మెల్యేల తీరు రానురాను వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా ఉదయ‌గిరి ఎమ్మెల్యే తీరును ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌జ‌లు స‌హించ‌లేని ప‌రిస్థితి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టికే ఎమ్మెల్యే బొల్లినేని వెంక‌ట‌రామారావు వ్య‌వ‌హారం మ‌హారాష్ట్రాలో క‌ల‌క‌లం రేపింది. తాజాగా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌డ‌దేవి అనే గ్రామంలో ప్ర‌జ‌లు ఆయ‌న్ని నిల‌దీసి, వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డం విశేషం.

పసుపు కుంభ‌కోణంలో ప్ర‌జ‌ల‌ను మోస‌గించడ‌మే కాకుండా, నిందితుల‌ను ఎమ్మెల్యే కాపాడుతున్నారా అన్న వాద‌న ప్ర‌జ‌ల నుంచి రావ‌డం క‌ల‌క‌లం రేపింది. జ‌డ‌దేవి గ్రామంలో అమ్మ‌వారి జాత‌ర కోసం వెళ్లిన బొల్లినేనికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆయ‌న రాకను గ‌మ‌నించిన‌ కొంతమంది గ్రామస్థులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి ఏలాంటి చర్యలు చేపట్టకుండా పసుపు కుంభకోణంలో అవినీతికి పాల్పడిన వారికి మద్దతు పలుకుతుండడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు.

అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయనతోపాటు అవినీతికి పాల్పడిన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఏమైనా మా ట్లాడాల్సి ఉంటే కలిగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి మాట్లాడాలని మరి ఎమ్మెల్యే సర్ధి చెప్పినప్పటికీ ఆందోళనకారులు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక తీవ్ర అసహనానికి గురైన బొల్లినేని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వరికుంటపాడులో జరిగిన పార్టీ మండల సర్వసభ్య సమావేశంలోనూ ఇదే గ్రామానికి చెందిన కార్యకర్తలు పసుపు కుంభకోణంలో అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్‌ చేయాలంటూ సభా వేదిక వద్ద కూడా నినాదాలు చేపట్టడం మండలంలోనూ సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. దాంతో బొల్లినేనికి ఈ వ్య‌వ‌హారం పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. సొ్ంత పార్టీ నేత‌లే వ్య‌తిరేకంగా గొంతు విప్పుతుండ‌డం విశేషంగా మారింది.


Related News

Amanchi-Krishna-Mohan

ఆమంచివి మూయించారు..

Spread the love5Sharesటీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కి అడ్డంకి ఏర్ప‌డింది. చీరాల ఎమ్మెల్యే క్వారీలు సీజ్ అయ్యాయి. ఆయనతోRead More

1736_ysrcp

వ‌ర్గ‌పోరుతో వైసీపీ స‌త‌మ‌తం

Spread the love3Sharesఏపీలో పాల‌క‌ప‌క్షంలో విబేధాలు ఇప్ప‌టికే పెను వివాదాల‌కు దారితీస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌కాశం జిల్లా అద్దంకి త‌గాదా ఇప్ప‌టికీRead More

 • టీడీపీకి యువ నేత రాజీనామా
 • టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్
 • వైసీపీలో ముదురుతున్న విబేధాలు
 • టీడీపీలో కలకలం కేసులో మేయర్
 • రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం
 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *