వైసీపీ లో వార్

1736_ysrcp
Spread the love

ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే నేతల సందడి కనిపిస్తోంది. టిక్కెట్లు, సీట్లు కన్ఫర్మ్ చేసుకోవడానికి కసరత్తులు చేస్తున్నారు. దాంతో అన్నిచోట్ల పొలిటికల్ హీట్ క్రమం రాజుకుంటోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. రెండు ప్రధాన పార్టీలలోనూ అదే పరిస్థితి ఉన్నప్పటికీ వైసీపీలో కొంత తీవ్రంగా ఉంది.

ప్రస్తుతం మార్కాపురం నుంచి వైసీపీ తరుపున జంకె వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వివాదరహితుడు. ప్రజలకు అందుబాటులో ఉండే నేత. అన్ని వర్గాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అయిితే అభ్యర్థిని మార్చే ప్రతిపాదనలో పార్టీ అధిష్టానం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యర్థుల ఆర్థిక దన్నుకు తగ్గట్టుగా నిలబడాలంటే మాజీ ఎ మ్మెల్యే కేపీ కొండారెడ్డి తగిన నేతగా ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. దాంతో వెంకటరెడ్డి వర్సెస్ కొండారెడ్డి అన్నట్టుగా మార్కాపురం వైసీపీలో వార్ సాగుతోంది. అదే సమయంలో వెన్నా హనుమరెడ్డి కూడా ఆశాభావంతో కనిపిస్తున్నారు. విద్యాసంస్థల అధినేతగా గుర్తింపు సాధించిన హనుమారెడ్డి క్లీన్ ఇమేజ్ ఉపయోగపడుతుందనే అంచనాలున్నాయి. అయితే కొండారెడ్డి మాత్రం ఓ అడుగు ముందుకేసి టీడీపీలో అసంత్రుప్తి వాదులతో భేటీ అవుతున్నారు. తాాజాగా తెలుగుదేశం వాణిజ్య విభాగం నేత ఇమ్మడి కాశీనాథ్ తో చర్చలు జరిపారు. అలాంటి నాయకులు వైసీపీలోకి వస్తే తన ప్రాభవం పెంచుకోవచ్చని కొండారెడ్డి అంచనాగా ఉంది.

టీడీపీలో నిన్నమొన్నటి వరకు మాజీఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి పేరు ఒక్కటే ప్రముఖంగా వినిపించేది. కానీ ఇమ్మడి కాశీనాథ్ మాత్రం కందుల పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. కందులను ఖాయం చేస్తే ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి. అది తెలుగుదేశం పార్టీకి మింగుడుపడని విషయంగా మారింది. దాంతో బీసీ అభ్యర్థిని బరిలో దించే యోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే పోరు ఆసక్తిదాయకమే .


Related News

MLC-polls-turned-into-a-proxy-war’-between-Chandrababu-Jagan-in-Kadapa-768x512

జగన్ నై: బాబు సై! ఆ ఇద్దరూ రయ్

Spread the love రాష్టంలొ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నేతలంతా సురక్షిత స్థానాల కోసం చూసుకుంటున్నారు.Read More

bjp-tdp

టీడీపీ, బీజేపీ డిష్షుం..డిష్షుం..!

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం చేత‌ల వ‌ర‌కూ వ‌చ్చేస్తోంది. బాల‌య్య కామెంట్స్ తో రాజుకున్న కాకRead More

 • ఆనం ప‌రిస్థితి విషమం
 • టీడీపీ అబ‌ద్ధం చెప్పిందా…?
 • వైసీపీకి ఊర‌ట‌: టీడీపీ ఆశ‌లు గ‌ల్లంతు
 • ద‌ర్శి జ‌గ‌న్ ని ద‌రిచేరుస్తుందా…?
 • ఆమంచివి మూయించారు..
 • వ‌ర్గ‌పోరుతో వైసీపీ స‌త‌మ‌తం
 • టీడీపీకి యువ నేత రాజీనామా
 • టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *