Main Menu

మాగుంట ముందుకా..వెన‌క్కా?

Spread the love

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ప్ర‌స్తుతం సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా ఒంగోలులో ఆయ‌న కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. అందులో కరణం బలరాంతోపాటు బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీరాం మాల్యాద్రి వంటి వారు మాగుంట‌తో సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలో వారు ముగ్గురు కలయిక రాజకీయంగా చర్చనీయాంశమైందనే చెప్పవచ్చు.

మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశంపార్టీలోనే కొనసాగుతారా లేక వైసీపీ గూటికి చేరుతారా అన్న చర్చ మాత్రం అన్ని వర్గాలనుండి వినిపిస్తొంది. ఈనెలాఖరునాటికి మాగుంట ఏరాజకీయ పార్టీలో ఉండేదన్న విషయాలు బహిర్గతవౌతాయన్న చర్చ సాగుతుంది. ఈనెల 20వతేదీన వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన టూర్ ఉండటంతో నాయకులు చేరికలు ఆయన వచ్చేవరకు నిలిచిపోయే అవకాశాలున్నాయి. ఈనేపధ్యంలో మాగుంట కూడా జగన్ విదేశీ టూర్‌నుండి వచ్చిన తరువాత వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారా? లేక తెలుగుదేశంపార్టీలోనే మళ్లీ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

మొత్తంమీద రానున్న రోజుల్లో ఇరుపార్టీల్లోనూ భారీగా నేతల వలసలు ఉండే అవకాశాలున్నట్లు ఆయా రాజకీయపార్టీల ద్వారా సమాచారం. కాగా తెలుగుదేశం, వైసీపీలు అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు చేస్తుండగా జనసేన తరపున మాత్రం ఇంతవరకు ఎలాంటి రాజకీయ నిర్ణయాలు జిల్లాలో జరగటంలేదని తెలుస్తోంది. మొత్తంమీద జిల్లాలోని ప్రధాన రాజకీయపక్షాల్లో రాజకీయాలు వేడెక్కాయనే చెప్పవచ్చు.






Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *