Main Menu

వైసీపీలో క‌ల‌హాల కాపురం

Spread the love

వైసీపీలో క‌ల‌హాలు ముదురుతున్నాయి. ధీమాగా ఉండాల్సిన చోట కూడా స‌మ‌స్య‌ల‌కు కార‌ణాల‌వుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావ‌లిలో విప‌క్ష పార్టీలో వ‌ర్గ‌పోరు ముదురుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌తాప్ కుమార్ రెడ్డికి సీటు ద‌క్క‌నివ్వ‌కూడద‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు పోటీపడుతున్నారు. త‌మ‌కు టికెట్ ఖాయం అంటూ మాజీ ఎమ్మెల్యేలు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. దాంతో వైసీపీలో క‌ల‌హాల కాపురం ఏ తీరానికి చేరునో అనే సందేహాలు చుట్టుముడుతున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌కావాల కోసం నేత‌లంతా సొంతంగా ప్ర‌య‌త్నాలు చేసుకుంటుండ‌డంతో పార్టీలో స‌ఖ్య‌త దెబ్బ‌తింటోంది. పార్టీ అదిష్టానం కూడా ఈ విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌కుండా కాల‌యాప‌న చేస్తుండ‌డంతో స‌మ‌స్య ముదిరేలా క‌నిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌తాప్ కుమార్ రెడ్డి మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను చూపించి త‌మ‌కు అవ‌కాశం వ‌స్తుందంటూ మిగిలిన ఇద్ద‌రు నేత‌లు ప్ర‌చారం చేసుకుంటూ ఉండ‌డంతో క్యాడ‌ర్ లో సందిగ్ధత ఏర్ప‌డుతోంది. ప్ర‌త్య‌ర్థి టీడీపీలో ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త క‌నిపిస్తోంది. వైసీపీలో అది క‌రువు కావ‌డంతో కావ‌లి వైసీపీలో స‌మ‌స్య‌గా మారుతోంది.






Related News

టీడీపీకి గుడ్ బై అంటున్న ఎమ్మెల్యే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల‌కు ఎన్నిక‌ల సెగ త‌గిలింది. ఇప్ప‌టికే తెలంగాణాలో ప్ర‌చారం ఊపందుకోగా , ఏపీలో వేడి రాజుకుంటోంది.Read More

ఊగిస‌లాట‌లో సీనియ‌ర్ టీడీపీ నేత‌!

Spread the loveతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న సీనియ‌ర్ నేత సందిగ్ధంలో ప‌డ్డారు. ముంద‌డుగు వేయాలా లేదా అనే ఊగిస‌లాట‌లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *