Main Menu

కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌బోతున్న టీడీపీ ఎమ్మెల్సీ

Spread the love

సీనియ‌ర్ నేత సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌చాలోరం సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌లకు త‌గ్గ‌ట్టుగా నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న నిర్ణ‌యాన్ని పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. దాంతో ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు హీటెక్కాయి. ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామంగా కూడా భావిస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అద్దంకి వ్య‌వ‌హారాల‌తో ఆయ‌న కాక మీదున్నారు. త‌న ప్ర‌త్య‌ర్థిని పార్టీలో చేర్చుకుని, పెత్త‌నం అప్ప‌గించ‌డాన్ని ఆయ‌న స‌హించ‌లేక‌పోతున్నారు. దాంతో ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకుని టీడీపీ అధిష్టానానికి ఝ‌ల‌క్ ఇచ్చే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

దానికి త‌గ్గ‌ట్టుగానే క‌ర‌ణం బ‌ల‌రాం పుట్టిన రోజు సంద‌ర్భంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 31న ఆయన జన్మదినం కావడంతో ఆ రోజు ఒంగోలులో భారీగా కార్యక్రమ నిర్వహణకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న బల రామ్‌కు జిల్లా వ్యాప్తంగా అభిమానులు, అనుచరులు ఉన్నారు. వారంద‌రినీ స‌మీక‌రించి పెద్ద స్థాయిలో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో బలరామ్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేస్తూ భారీగా ప్లేక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అదే స‌మ‌యంలో రాజ‌కీయంగా కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. త‌న వార‌సుడు క‌ర‌ణం వెంక‌టేష్ రాజ‌కీయ భ‌విత‌వ్యంతో పాటు త‌న మాట‌కు విలువ ఇవ్వ‌ని పార్టీకి షాకిచ్చే యోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది. వాస్త‌వానికి క‌ర‌ణం బ‌ల‌రాంకి ఇప్ప‌టికే వైసీపీలో ఆహ్వానం ఉంది. దానిని ఆయ‌న అంగీక‌రించి మ‌రో అడుగు వేస్తారా లేదా అన్న‌ది తేలిపోబోతోంది.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *