Main Menu

క‌ర‌ణం బ‌ల‌రాంని పొమ్మ‌న్నారు..!

Spread the love

టీడీపీ సీనియ‌ర్ నేత‌ల్లో క‌ర‌ణం బ‌ల‌రాం ఒకరు. అనేక డ‌క్కాముక్కీలు తిన్న నేత అత‌డు. అనేక ప‌ద‌వులు అనుభ‌వించి, ఆటంకాలు అధిగ‌మించి ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు. అయితే అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌డిచిన ఎన్నిక‌ల్లో క‌ర‌ణం బ‌ల‌రాం వార‌సుడు వెంక‌టేష్ ఓట‌మి పాలుకావ‌డం ఆయ‌న‌కు కొంత ఇబ్బందిగా మారింది. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో క‌ర‌ణం కుటుంబం ఓట‌మి పాలుకావ‌డంతో వారి ప్రాభ‌వం త‌గ్గుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఎమ్మెల్సీగా ఉన్న ఆయ‌న్ని కాద‌ని, ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికి టీడీపీలో ప్రాధాన్య‌త‌నిస్తున్నారు


దీనిని క‌ర‌ణం వ‌ర్గం స‌హించ‌లేక‌పోతోంది. ఈ ప‌రిణామాలు ఇప్ప‌టికే అద్దంకిలో అనేక స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అయ్యింది. ఇక తాజాగా టీడీపీ స‌మ‌న్వ‌య‌క‌మిటీ స‌మావేశం ఒంగోలులో జ‌రిగింది. సీఎం చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో క‌ర‌ణం బ‌ల‌రాం కూడా పాల్గొన్నారు. అయితే అనూహ్యంగా ఆయ‌న అవ‌స‌రం లేద‌ని, బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచ‌న రావ‌డంతో క‌ర‌ణం ఆశ్చ‌ర్య‌పోయారు. షాకితిన్నారు. అయితే వెంట‌నే తేరుకుని అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్న గొట్టిపాటికి మాత్ర‌మే స‌మావేశంలో అవ‌కాశం ఉండ‌డంతోనే ఎమ్మెల్సీ అయిన‌ప్ప‌టికీ క‌ర‌ణం బ‌ల‌రాం బ‌య‌ట‌కు వెళ్ల‌క త‌ప్ప‌లేదు.

క‌ర‌ణం బ‌ల‌రాంతో పాటు చీరాల‌లో మ‌రో ఎమ్మెల్సీ పోతుల సునీత ప‌రిస్థితి కూడా అలానే అయ్యింది. దాంతో ఆమె కూడా స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. ఈ ప‌రిణామంతో క‌ర‌ణం వ‌ర్గం కుత‌కుత‌లాడుతోంది. సీనియ‌ర్ అనే గౌర‌వం కూడా లేకుండా స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి తీసుకురావ‌డం ప‌ట్ల సీరియ‌స్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రిణామాలు ఎటు దారితీస్తాయోన‌నే చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల పుట్టిన రోజు జ‌రుపుకున్న క‌ర‌ణం బ‌ల‌రాం కీల‌క నిర్ణ‌యం తీసుకోవాలని ఆశించిన‌ప్ప‌టికీ వేచి చూడాలంటూ స‌న్నిహితులు చేసిన సూచ‌న‌తో ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు. తాజా ప‌రిణామాల‌తో ఆయ‌న ఎలా స్పందిస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.






Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *