Main Menu

సంచ‌ల‌నం: ప్రియురాలి భ‌ర్త హ‌త్య‌లో జ‌న‌సేన నాయ‌కుడు

Spread the love

జ‌న‌సేన టికెట్ కూడా ఆశిస్తున్న ఓ నాయ‌కుడి వ్య‌వ‌హారం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే క‌ల‌క‌లం రేపుతున్న ప్ర‌కాశం జిల్లా కంభం ప్రాంతానికి చెందిన వ్యాపారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కిడ్నాప్, హ‌త్య వెనుక జ‌న‌సేన టికెట్ రేసులో ఉన్న ఓ నాయ‌కుడి పాత్ర బ‌య‌ట‌ప‌డ‌డం దుమారం రేపుతోంది.

జగన్మోహన్‌రెడ్డి (36) కిడ్నాప్ మృతదేహాన్ని శ్రీశైలం అడవుల్లో రోళ్లపెంట వద్ద గుర్తించారు. జగన్‌మోహన్‌రెడ్డి భార్య, ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టి నట్లు తెలుస్తోంది. అతడికి కంభంలో కారులోనే మత్తు ఇంజె క్షన్‌ ఇచ్చి ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్లు తెలిసింది. అనంతరం మృతదేహాన్ని శ్రీశైలం ఘాట్‌రోడ్డుకు తరలించి రోళ్లపెంట వద్ద లోయలో పడేశారు. ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌, ముగ్గురు కిరాయి హంతకుల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం.

కంభం మండలం ఎల్‌.కోట గ్రామానికి చెందిన బాలవెంకటనారాయణ డాక్టర్‌ పట్టా పుచ్చుకున్నాక కంభం ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. ఆత‌ర్వాత‌ గుంటూరులోని ఓ కార్పొరేట్‌ వైద్యశాలలో ప‌నిచేశారు. ఆయ‌న ప‌నిచేసిన ప్రాంతాల్లో మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌నే అభియోగాలున్నాయి. అయితే డాక్టర్‌ నారాయణ భార్య స‌హ‌కారంతో కంభంలో మల్టీస్పెషాలిటీ వైద్యశాలను ప్రారంభించాడు. అయితే తన బుద్ధి మార్చుకోని డాక్టర్‌ వైద్యశాలలో పని చేసే మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో భార్య ఆయ‌న‌కు దూరంగా ఉంటున్న‌ట్టు స‌మాచారం. అంతేగాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ తరఫున గిద్దలూరు నుంచి పోటీ చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. టికెట్టు ఆశిస్తున్న డాక్టర్‌ నారాయణ దానికి త‌గ్గ‌ట్టుగా విస్తృత ప్రచారం చేస్తున్నాడు. మన సేవా చారిటబుల్‌ ట్రస్టు పేరుతో పేదలకు సహాయం చేస్తున్నట్లు చెప్పు కుంటున్న ఆయన ఇప్పుడు ప్రియురాలితో క‌లిసి ఆమె భ‌ర్త హ‌త్య‌కు స్కెచ్ వేసిన‌ట్టు నిర్ధార‌ణ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన జగన్మోహన్‌రెడ్డికి బేస్తవారపేట మండలం చిన్నఓబినేనిపల్లికి చెందిన రజనితో సుమారు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా కంభం వచ్చి స్థిరపడ్డారు. జేసీబీలు, ట్రాక్టర్లు, డోజర్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం ప్రారంభించాడు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఫోన్‌ రావడంతో బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. బుధవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ ప్రారంభించగా అవాక్కయ్యే అనేక నిజాలు వెలుగు చూశాయి.

జగన్మోహన్‌రెడ్డిని భార్య రజని ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. కంభం వ‌చ్చిన‌ తర్వాత రజనికి ఎల్‌. కోట గ్రామానికి చెందిన ప్ర‌ముఖ‌ డాక్టర్‌ బాల వెంకటనారాయణ అ్లలియాస్‌ నారాయణతో పరిచయం ఏర్ప డింది. ఇంటర్మీడియట్‌ ఇద్దరూ కలిసి కంభంలో చదువుకున్నట్లు తెలిసింది. ఆ పరిచయంతో ఏర్పడిన స్నేహం వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న జగన్మోన్‌రెడ్డి భార్యను మందలించినట్లు సమాచారం. దీంతో వారి మధ్య గొడవలు పెరిగాయి. దీంతో భర్తను అడ్డు తొలిగించుకోవాలని రజని నిర్ణయించుకుంది. ప్రియుడు డాక్టర్‌ నారాయణతో కలిసి భర్త జగన్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ హత్య పథకం ప్రకారం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. రూ. 15లక్షలకు సుపారీ కు దుర్చుకున్న కానిస్టేబుల్‌ మంగళవారం ముగ్గురు కిరాయి హంతకులతో కంభం వచ్చాడు. రాత్రి 11.30 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్‌ తన గుర్తింపు కార్డు చూపి నీతో మాట్లాడేందుకు పోలీసు అధికారి కారులో వచ్చాడని నమ్మబలికి బయటకు తీసుకువచ్చాడు. అతను కారు వద్దకు వచ్చిన తర్వాత లోపల ఉన్న వైద్యుడితోపాటు, ముగ్గురు కిరాయి హంతకులు జగన్‌మోహన్‌రెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించారు. లోపల ఉన్న వారు ఆయన్ను గట్టిగా పట్టుకోగా డాక్టర్‌ నారాయణ మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు తెలిసింది. జగన్‌ మత్తులోకి జారుకోగానే గొంతునులిపి చంపినట్లు సమాచారం.

కంభంలో జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేసిన నిందితులు కారులోనే మృతదే హాన్ని తీసుకుని దోర్నాలలోని కర్నూలు రోడ్డుకు వెళ్లారు. అక్కడి రోళ్లపెంట వద్ద కారును ఆపి 50 అడుగుల లోయలో మృతదేహాన్ని పడేసి కర్నూలు వెళ్లిపోయారు. ఈ హత్యకు వ్యూహం రచించిన డాక్టర్‌ను, మృతుడి భార్యను బుధవారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం కర్నూలు నుంచి కానిస్టేబుల్‌ను కంభం తీసుకువచ్చారు. అత ని సహకారంతో శుక్రవారం మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం కోసం మార్కాపురం వైద్యశాలకు తరలించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన నాగులవరం తీసుకువచ్చి అంత్యక్రియలు చేయనున్నట్లు తెలిసింది.


Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *