Main Menu

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the love

తెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారి టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సంబంధించిన సంస్థ‌ల‌పై గురిపెట్టారు. ఇప్ప‌టికే సీఎం ర‌మేష్ స‌హా ప‌లువురు టీడీపీ నేత‌లు, బంధువుల ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఐటీ దాడులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అంతేగాకుండా మాజీ కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి కార్యాల‌యంలో నిర్వ‌హించిన సోదాల ఆధారంగా ప్ర‌స్తుతం ఆయ‌న విచార‌ణ ఎదుర్కొంటున్నారు.

ఈలోగా చెన్నైలోని మాగుంట బాలాజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై ఐటీ దాడులు విశేషంగా మారాయి.. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇటీవ‌ల ప‌ది రోజుల పాటు కొంత విరామం తీసుకున్న‌ట్టుగా క‌నిపిస్తున్న ఐటీ శాఖ అధికారులు తెలంగాణా ఎన్నిక‌లు ముగిసిన మ‌రునాడే రంగంలోకి రావ‌డం ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది.

చెన్నై టీనగర్‌లోని మాగుంట‌ కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు తనఖీలు జరిపారు. సవేరా హోటల్‌లో భారీగా నగదు, బంగారం లభ్యమైంది. ఇందుకు అనుగుణంగా అధికారులు తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు లెక్కకురాని 55 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం. దాంతో ఈ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. టీడీపీకి ఆర్థికంగా అండ‌దండ‌లు అందిస్తున్న వారంద‌రినీ ఇరుకున పెట్టేలా ఈప‌రిణామాలు క‌నిపిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు చుట్టూ ఈ వ్య‌వ‌హారాల‌న్నీ వ‌ల‌యంలా చుట్టుముట్టే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంచ‌నాలేస్తున్నారు. దాంతో ఈ ఐటీ దాడులు రాజ‌కీయంగా కీల‌కం కాబోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.






Related News

సోమిరెడ్డికి సొంతింట్లోనే సెగ‌

Spread the loveఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి షాక్ త‌ప్పేలా లేదు. ఇప్ప‌టికే ఆయ‌న వ‌రుస‌గా ఎన్నిక‌ల్లో ఓట‌మిRead More

తెలుగు తమ్ముళ్ల త‌గాదాలో ద‌గ్గుబాటికి క‌లిసొచ్చేనా?

Spread the loveతెలుగుతమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయి చేరుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టిసారించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *