వెంక‌య్యకి మ‌రో షాక్: షోకాజ్ నోటీసులు జారీ

venkayya
Spread the love

ఇటీవ‌లే కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి, ఉప రాష్ట్ర‌ప‌తి బ‌రిలో దిగిన ముప్ప‌వ‌ర‌ప్పు వెంక‌య్య‌నాయుడుకి అనూహ్య ప‌రిణామం ఎదుర‌య్యింది. ఆయ‌న సంస్థ‌కు షోకాజ్ నోటీసు జారీ అయిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. కేంద్ర హోం శాఖ ప‌రిధిలోని ఎఫ్సీఆర్ఐ నోటీసులు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వెంక‌య్య కుమార్తె దీపా వెంక‌ట్ నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ భార‌తి ట్ర‌స్ట్ నిధుల విష‌యంలో నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతోనే ఈనోటీసులు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

వెంక‌య్య స్థాపించిన స్వ‌ర్ణ‌భార‌తి ట్రస్ట్ ఇప్ప‌టికే పలు వివాదాల్లో ఇరుక్కుంది. భూ ఆక్ర‌మ‌ణ‌ల ఆరోప‌ణ‌లున్నాయి. ఇక తాజాగా విదేశీ నిధుల విష‌యంలో నిబంధ‌న‌లు పాటించ‌డం లేదంటూ నోటీసులు జారీ కావ‌డం విశేషంగానే భావించాలి. అది కూడా ఆయ‌న మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక కాబోతున్న త‌రుణంలో విడుద‌ల కావ‌డం ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. విదేశీ నిధుల విష‌యంలో ప్ర‌తీ ఏటా ఎన్జీవోలు వార్షిక నివేదిక‌లు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. కానీ వెంక‌య్య‌కు చెందిన ఈ ట్ర‌స్ట్ మాత్రం దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించింద‌నేది ఆరోప‌ణ‌. 2011 నుంచి 2015 వ‌ర‌కూ వ‌రుస‌గా నాలుగు ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో ఈ నోటీసులు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.

దాంతో ఇప్పుడుది రాజ‌కీయంగానూ ఆస‌క్తిగా మారింది. చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అంద‌రికీ శ‌కునాలు చెప్పే బ‌ల్లి చివ‌ర‌కు కుడితిలో ప‌డింద‌న్న‌ట్టుగా అంద‌రికీ నీతులు చెప్పే వెంక‌య్య నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం గురివింద‌ను త‌ల‌పిస్తోంద‌నే వాద‌న ఉంది. అయితే ఈ నోటీసుల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ సంబంధిత అధికారులు నిర్థారించ‌లేదు.


Related News

dsbv swamy kondepi

ఎమ్మెల్యే గారి పెళ్లి

Spread the love6Sharesఎమ్మెల్యే గారు పెళ్లి కొడుకయ్యారు. డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కొండెపిRead More

bollineni ramarao

టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన గ్రామస్తులు

Spread the love13Sharesటీడీపీ ఎమ్మెల్యేల తీరు రానురాను వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా ఉదయ‌గిరి ఎమ్మెల్యే తీరును ఆయ‌న సొంతRead More

 • జ‌గ‌న్ ని పొగిడి, బాబుని తెగిడిన టీడీపీ ఎంపీ
 • ఉండ‌వ‌ల్లి, ద‌గ్గుపాటి క‌ల‌యిక వెనుక‌..!
 • గిద్ద‌లూరు టీడీపీ క‌ట్ట‌లు తెంచుకుంది..!
 • ఆప‌రేష‌న్ ప్ర‌కాశం ప్రారంభించిన వైసీపీ
 • నంద్యాల‌ జిల్లా కేంద్రం: రాష్ట్రంలో 25 జిల్లాలు
 • ఒంగోలు వైసీపీలో కొత్త చ‌రిత్ర‌
 • చంద్ర‌బాబు కోపం వ‌చ్చింది..!
 • అద్దంకిలో మ‌ళ్లీ రాజుకున్న చిచ్చు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *