Main Menu

వ‌ర్గ‌పోరుతో వైసీపీ స‌త‌మ‌తం

1736_ysrcp
Spread the love

ఏపీలో పాల‌క‌ప‌క్షంలో విబేధాలు ఇప్ప‌టికే పెను వివాదాల‌కు దారితీస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌కాశం జిల్లా అద్దంకి త‌గాదా ఇప్ప‌టికీ తీర‌లేదు. చంద్ర‌బాబు ఎన్నిమార్లు పంచాయితీ నిర్వ‌హించినా స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులిద్ద‌రూ పై చేయికోసం పోటీ ప‌డుతున్న తీరు ఆపార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా త‌యార‌య్యింది. అదే స‌మ‌యంలో వైసీపీ వ్య‌వ‌హారం కూడా దానికి త‌గ్గ‌ట్టుగానే ఉంది. ప్ర‌కాశం జిల్లాలో మంచి ప‌ట్టున్న వైసీపీ దానిని నిల‌బెట్టుకునే దిశ‌లో క‌నిపించ‌డం లేదు. పైగా అధినేత పాద‌యాత్ర సాగుతున్న వేళ కూడా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌ర్గ‌పోరు వీధికెక్కుతోంది. పెత్త‌నం కోసం పోటీ ప‌డుతున్న నేత‌ల‌తో పార్టీ ప‌రువు పోయేలా క‌నిపిస్తోంది.

ప్ర‌కాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేత‌ల మ‌ధ్య‌ అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. తాజాగా కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జీ బుర్రా మధుసూదన్‌యాదవ్ తమకు వద్దంటూ వైసిపికి చెందిన నాయకులు,కార్యకర్తలే బాహాటంగానే ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ మరోకవర్గాన్ని బుర్రా చిన్న‌చూపు చూస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. జగన్ పాదయాత్ర జిల్లాలో జరుగుతున్న సమయంలోనే కనిగిరి రాజకీయ వ్యవహరం దూమారం రేగింది.

కొండెపి నియోజకవర్గంలోను ఇదే పరిస్ధితి నెలకొంది. కొండెపి ఇన్‌చార్జీ వరికూటి అశోక్‌బాబుపై కొంతమంది నేతలు అసమ్మతి బావుటా ఎగురవేస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఇన్‌చార్జీ ఐవి రెడ్డి, మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయికల్పనారెడ్డిల గ్రూపు రాజకీయాలు విరాజిల్లుతున్నాయి. ప్రధానంగా దర్శి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదురెడ్డి, ఇన్‌చార్జీ బాదం మాధవరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఆగాధం ఏర్పడింది. వీరిద్దని సయోధ్యచేస్తే తప్ప అక్కడ పార్టీపరిస్ధితులు మెరుగుపడే పరిస్ధితులు కనిపించటం లేదు. సంతనూతలపాడులో అదే సీన్ క‌నిపిస్తోంది. ఈ నియోజకవర్గానికి గతంలో సామాన్యకిరణ్‌ను పార్టీనియమించినప్పటికి ఆమె నియామకంపట్ల నియోజకవర్గ నాయకులు సుముఖత వ్యక్తం చేయకపోవటంతో అక్కడ నాయకత్వ సమస్య జఠిలంగా మారింది. చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లోను పార్టీనిబలోపేతం చేయాల్సిన ద‌శ‌లో నేత‌ల మ‌ధ్య స‌మ‌స్య‌లు వైసీపీకి వ‌చ్చిన అవ‌కాశాలు నిల‌బెట్టుకోలేని స్థితికి చేరుస్తున్నాయి. నేత‌లంతా ఐక్యంగా ఉండేలా అధినేత ప‌రిస్థితి చ‌క్క‌దిద్ద‌క‌పోతే చివ‌రి నిమిషంలో చేతులు కాల్చుకోవాల‌సిన దుస్థితి దాపురించే ప్ర‌మాదం పొంచి ఉంటుంది.


Related News

nellore

టీడీపీలో నాలుగుస్తంభాల‌ట‌

Spread the loveనెల్లూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు ఉధృత‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు ఈ ఉక్క‌పోత భ‌రించ‌లేక టీడీపీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నారు.Read More

tdp

టీడీపీని వీడిపోతున్నా…!

Spread the loveతెలుగుదేశం పార్టీ నుంచి సీనియ‌ర్ నేత జారిపోవ‌డం ఖాయం అయ్యింది. గుర్తింపు లేని చోట తానుండలేన‌ని మాజీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *