Main Menu

ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు..

Spread the love

ఓ ఎమ్మెల్యే వ్యవహారం దుమారం రేపుతోంది. అధికార పార్టీలో చేరిన తర్వాత గొట్టిపాటి రవికుమార్ తీరుతో తనకు చావే గతి అంటూ ఓ లిక్కర్ వ్యాపారి రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఆయన లెటర్ రాసి కనిపించకుండా పోవడం సంచలనం అవుతోంది. ‘మద్యం షాపు విషయమై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆయన పీఏ సారథి నన్ను బెదిరిస్తున్నారు. చంపుతామని హెచ్చరించారు. ఇక ఆయన నన్ను బతకనివ్వడు. నేనే ఆత్మహత్య చేసుకొని చనిపోతా’ అంటూ చిలకలూరిపేటకు చెందిన మద్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాసరావు సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

దాంతో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. శ్రీనివాసరావు సోదరుడు వెంకట సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ముక్తేశ్వరానికి చెందిన ఊటుకూరి శ్రీనివాసరావు మొదట్నుంచి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయుడిగా ఉన్నాడు. ఈ ఏడాది బల్లికురవ మండలం కొమ్మాలపాడులో శ్రీనివాసరావు మద్యం దుకాణం ఏర్పాటు చేశాడు. గొట్టిపాటి తన వర్గానికి చెందిన నాగేశ్వరరావుతో ఆ పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు చేయించారు. తన వర్గంలో చేరాలని.. లేదంటే మద్యం దుకాణం మూసేసి వెళ్లిపోవాలంటూ గొట్టిపాటి, ఆయన పీఏ సారథి, మరికొందరు నిత్యం బెదిరింపులకు దిగుతూ శ్రీనివాసరావును మానసికంగా వేధించారు. మాట వినకపోవడంతో.. ఎమ్మెల్యే చివరకు తన అధికార బలం ఉపయోగించి మద్యం దుకాణాన్ని మూసివేయించారు. దీంతో శ్రీనివాసరావు వారం కిందట తొమ్మిది పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

తన సోదరుడు శ్రీనివాసరావు అదృశ్యంపై ఈ నెల 16న చిలకలూరిపేట టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెంకట సుబ్బారావు చెప్పారు. గొట్టిపాటి, పీఏ సారథి, మద్యం వ్యాపారి నాగేశ్వరరావు బెదిరింపుల వాయిస్‌ రికార్డులను అందించినప్పటికీ వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారన్నారు.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *