మళ్లీ కొట్టుకున్నారు..

karanam-gottipati-666-21-1463818344
Spread the love

అద్దంకి రాజకీయం పద్దతి మారడం లేదు. తాజాగా మరో తగాదా తెరమీదకు వచ్చింది. ఈసారి కూడా దాదాపుగా కొట్టుకునే వరకూ వచ్చేశారు. చేతులు లేవడంతో మిగిలిన నేతలంతా అవాక్కయ్యారు. అంతా సర్థిచెప్పాల్సి వచ్చింది. ముఖ్యంగా మంత్రి శిద్ధా రాఘవరావు కి చెమటలు పట్టాల్సి వచ్చింది. అయినా కరణ బలారం, గొట్టిపాటి నేరుగా ముఖాముఖీ తలపడే పరిస్థితి రావడం కలకలం రేపింది.

ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీల నియామకం విషయం మరోసారి మంటలు రేపింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వివాదం ఇక్కడ కూడా ప్రస్ఫుటించింది. ఇద్దరు నేతలు పట్టువీడడం లేదు. దాంతో సమస్యను పరిష్కరించడం కోసం పార్టీ జిల్లా సమన్వయ కమిటీలో చేసిన ప్రయత్నం కూడా విఫలం అయ్యింది. దాంతో నేతలలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా గొట్టిపాటి, కరణం నేరుగా తగాదాకి దిగడం కలకలం రేగింది.కేకలు వేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు రెచ్చిపోతుంటే సహించిదే లేదని కరణం వ్యాఖ్యానించడం, దానికి ప్రతిస్పందనగా గొట్టిపాటి ఘాటుగా స్పందించడంతో సమస్య మొదలయ్యింది. అయినా చివరి వరకూ అదే వేడి కొనసాగడంతో అసలు సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.


Related News

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the loveటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

hqdefault

రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం

Spread the loveఏపీలో అధికార పార్టీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారికితోడుగా మిత్రపక్షం నేతలు కూడా కలుస్తున్నారు.Read More

 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
 • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
 • మళ్లీ కొట్టుకున్నారు..
 • ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *