Main Menu

ఆ సీటుకి క్యాండిడేట్ ఖాయం చేసిన జగన్

1736_ysrcp
Spread the love

ప్రకాశం జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. మరోసారి పట్టు నిలుపుకోవాలని వైసీపీ ఆశిస్తోంది. అదే సమయంలో గట్టి పోటీ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి బరిలో దిగే వారి విషయంలో స్పష్టత కోసం వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగా ఇప్పటికే పలువురు నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నంలో ఉంది.

ముఖ్యంగా అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో ముందుగా మనసులో మాట వెల్లడిస్తే చివరిలో సమస్యలు రాకుండా చూడవచ్చని వైసీపీ భావిస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆపార్టీకి గట్టి పట్టు ఉండడంతో ఆశావాహుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ ఇచ్చే ఉద్దేశంలో భాగంగా గిద్దలూరు స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనా రెడ్డికి దాదాపు ఖాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వైసీపీ టికెట్ పై గెలిచి ఆ తర్వత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎన్ఆర్ఐ ఐవీ రెడ్డిని జగన్ బరిలో దింపారు. అయితే ఆయన రాజకీయాలకు కొత్త కావడంతో అన్ని వర్గాలను కలుపుకుని పోవడంతో కొంత ఇబ్బందులున్నట్టు భావిస్తున్నారు. అదే సమయంలో యువనేతగా కొంత గుర్తింపు సాధించినప్పటికీ ప్రత్యర్థిని ఓడించాలంటే మరింత పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.

saikalpana pidathala

ఈ తరుణంలో సీనియర్లకు ఛాన్సివ్వాలని నిర్ణయించుకున్న వైసీపీ అధిష్టానం గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయికల్పనారెడ్డిని ఖరారు చేసే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల్లో ప్రచారం సాగుతోంది. దాంతో ఈ ప్రచారం సాయికల్పనా రెడ్డి వర్గంలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అయితే మరో మాజీ ఎమ్మెల్యే అన్నే రాంబాబు చూపు కూడా వైసీపీ వైపు ఉంది. ఆయనకు టికెట్ ఖాయం చేస్తే కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి సై అనడం ఖాయం అని చెప్పక తప్పదు. అదే సమయంలో జిల్లాలో సామాజిక సమీకరణాలు కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ప్రస్తుత పరిణామాలు చివరి వరకూ ఉండే అవకాశం లేదు. ఎలాంటి మార్పులు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.


Related News

07-1457330006-28-anam-ramanarayana-reddy-600

ఆనం వారికి ఆ సీటు ఖాయం ..!

Spread the love4Sharesఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి సీటు ఖాయం అయిపోయింది. అడ్డంకులు తొల‌గిపోయిన‌ప్ప‌టికీ ముహూర్తం మాత్రం ఆషాడం త‌ర్వాతేన‌ని చెబుతున్నారు.Read More

9173_ysrcp-3

వైసీపీ తెర‌మీద‌కు కొత్త నేత‌లు

Spread the love9Sharesవైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. రాజ‌కీయంగా జ‌గ‌న్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ల విష‌యంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *