Main Menu

సందిగ్ధంలో మాజీ ఎమ్మెల్యే

Spread the love

ఆయ‌న మాజీ ఎమ్మెల్యే. నాయ‌కుడిగా మంచి గుర్తింపు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆయ‌న సందిగ్ధంలో ప‌డ్డారు. ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. దాంతో గ‌త‌ ఏడాది ఆగస్టులో తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎటు పయనిస్తారో సందిగ్ధంలో ఉంది. ఆయన ఏపార్టీలో చేరుతారో అని ఆయన అనుచరులు వేచి చూస్తున్నారు. గతఏడాది ఆగస్టు 4న టీడీపికి రాజీమానా చేసినా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై స్నేహాభావాలను, వర్గాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఆయ‌న నిర్ణ‌యం ఆధారంగా గిద్ద‌లూరు రాజ‌కీయాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని అంతా భావిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రయాణం ఎటునుంచోనని నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యంపార్టీ తరుపున బరిలో నిలిచి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గ్రామగ్రామాన పర్యటించి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. రెండవసారి ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రజలకు విస్తృత సేవలు అందించారు. ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ కార్యకర్తలకు చేస్తున్న అన్యాయన్ని విభేదించిన ఆయన టిడిపికి 2017 ఆగస్టు 4వతేదిన రాజీనామా చేశారు. అనంతరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసి నియోజకవర్గ ప్రజలకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని, టిడిపి ఆకృత్యాలను ప్రజల్లోనికి తీసుకువస్తానన్న అన్నా రాంబాబు కొందరు పెద్దల సలహామేరకు పాదయాత్రను విరమించారు. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు ప్రతి కార్యక్రమానికి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. తాను 2019 ఎన్నికల బరిలో ఉంటానని, స్వతంత్య్ర అభ్యర్థిగానైనా పోటీచేసి విజయం సాధించడమే తన లక్ష్యమని అన్నా తన అనుచరులతో అంటున్నారు. .

వైసీపీ టికెట్ ఆశిస్తున్నా ఆయ‌న‌కు స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. ఆ విష‌యంలో క్లారిటీ వ‌స్తే ఆయ‌న ఓ అడుగు ముందుకేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. జ‌న‌సేన గురించి ఆలోచించిన‌ప్ప‌టికీ ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కూడా క‌లిసిన‌ప్ప‌టికీ ఉప‌యోగం ఉండ‌ద‌నే లెక్క‌ల్లో ఉన్న‌ట్టు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గిద్ద‌లూరు రాజ‌కీయాల్లో అన్నే రాంబాబు నిర్ణ‌యం ఆస‌క్తిని రేకెత్తించ‌బోతోంది.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *