వివాదాస్పదంగా మారుతున్న గంటా

ganta srinivas
Spread the love

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిత్యంలో వార్తల్లో ఉండే నాయకుడు. అటు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖలోనే కాకుండా ఇటు సొంత జిల్లా ప్రకాశంలోనూ ఇప్పుడు ఆయన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా సొంత ప్రాంతంలో విద్యామంత్రి నిర్వాహకం వివాదాస్పదమవుతోంది. ప్రకాశం జిల్లా కొండెపి మండలం కామేపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పేరు వివాదంగా మారుతోంది. స్కూల్‌ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తే… వారి దివంగతుల పేర్లు పాఠశాలకు పెట్టుకోవచ్చన్న నిబంధనపై వివాదం చెలరేగుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు కామేపల్లిలో జన్మించడంతో… స్కూల్‌కు గంటా నారాయణమ్మ, రోశయ్య మెమోరియల్‌ పేరు పెట్టాలనుకోవడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.

1961లో కామేపల్లి గ్రామస్తులు కొంతమంది కలిసి మూడెకరాల 65 సెంట్ల భూమిని పాఠశాలకు దానం చేశారు. అలాగే పశువుల ఆస్పత్రి, పాల డెయిరీ, దేవస్థానాలకు కోట్లాది రూపాయల విలువైన భూమిని అందజేశారు. కానీ… తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు స్కూల్‌ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చి… స్కూల్‌కు ఆయన తల్లిదండ్రుల పేరు పెట్టాలనుకోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ స్కూల్‌కు పేరు పెట్టాల్సి వస్తే అప్పట్లో భూమి ఇచ్చి.. పాఠశాలను నిర్మించిన వారి పేర్లు పెట్టాలంటున్నారు గ్రామస్తులు. ఎట్టి పరిస్థితిలోనూ గంటా తల్లిదండ్రుల పేర్లు పెడితే ఒప్పుకునేది లేదంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇక్కడ పుట్టినా… ఆయన వల్ల గ్రామానికి ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు మాజీ శాసనసభ్యులు దివంగత చాగంటి రోశయ్య కుటుంబీకులు. అప్పట్లో కొంతమంది గ్రామస్తులు కలిసి భూమి దానంగా ఇస్తే.. ఇప్పుడు గంటా కుటుంబీకుల పేర్లు పెట్టాలనుకోవడం సరికాదంటున్నారు.

మంత్రి హోదాలో ఉన్న గంటా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉన్నా… ఎప్పుడో నిర్మించిన స్కూల్‌కు ఆయన తల్లిదండ్రులు పెట్టుకోవాలనుకోవడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు.. మొత్తానికి స్కూల్‌ పేరు మార్పు అంశంపై కామేపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉదార స్వభావంతో ఆనాడు గ్రామస్తులు భూమి దానంగా ఇస్తే… ఇప్పుడు గంటా కుటుంబీకుల పేర్లు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పేరు మార్పు అంశంపై గ్రామస్తులు కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం స్టే విధించింది. ఒకవేళ పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గంటా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి !


Related News

YV SUBBAREDDY

వైసీపీ ఎంపీ కి చేదు అనుభవం

Spread the loveప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమకు రావాల్సిన వేతనాలు రాకుండా చేసిRead More

ycp

టీడీపీ నుంచి వైసీపీలోకి మాజీ ఎంపీ

Spread the loveవైసీపీ లో మళ్లీ జాయినింగ్స్ పర్వం మొదలయ్యింది. గడిచిన కొన్నాళ్లుగా దానికి బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా నంద్యాలRead More

 • ఆ సీటుకి క్యాండిడేట్ ఖాయం చేసిన జగన్
 • వివాదాస్పదంగా మారుతున్న గంటా
 • సీబీఐ చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే
 • అవునా..సోమిరెడ్డిని నిలదీస్తే శిక్షా?
 • జగన్ కి జ్వరమొచ్చింది
 • వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్
 • ఎమ్మెల్యే గారి పెళ్లి
 • టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన గ్రామస్తులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *