జగన్ నై: బాబు సై! ఆ ఇద్దరూ రయ్

MLC-polls-turned-into-a-proxy-war’-between-Chandrababu-Jagan-in-Kadapa-768x512
Spread the love

రాష్టంలొ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నేతలంతా సురక్షిత స్థానాల కోసం చూసుకుంటున్నారు. ఏపార్టీలో తాము శ్రేయస్కరమన్న విషయంలో అంచనాలు వేసుకుంటున్నారు. అందులో భాగంగా గడిచిన ఎన్నికల్లో దూరంగా ఉన్న ప్రకాశం జిల్లా సీనియర్ నాయకులు ఈసారి బరిలో దిగడం కోసం ఆసక్తిగా ఉన్నారు. అయితే అందుకు తగ్గ పార్టీ విషయంలో సందిగ్దం రాజ్యమేలుతోంది.

కందుకూరు నియోజకవర్గంలో వైసీపీకి మంచి అవకాశాలున్నాయి. గడిచిన ఎన్నికల్లో కూడా ఆపార్టీ విజయం సాధించింది. కానీ పోతుల రామారావు పార్టీ ఫిరాయించడంతో తగిన నాయకుడి కోసం ఎదురుచూడాల్సిన స్థితిలో మాజీ మంత్రి మానుగుంట మహిందర్ రెడ్డి కోసం విపక్ష నేతలు ప్రయత్నించారు. అయితే ఆయన మాత్రం చివరి వరకూ వాయుదా వేసుకుంటూ వచ్చారు. దాంతో కందుకూరులో ప్రత్యామ్నాయం చూసుకున్న వైసీపీ ఇప్పుడు చివరి క్షణంలో మానుగంటకి నై అని చెప్పేసినట్టు సమాచారం. దాంతో తన దాని తాను చూసుకోవాలని నిర్ణయించుకున్న మానుగుంట సైకిల్ ఎక్కడానికి సిగ్నల్స్ ఇస్తున్నారు. జగన్ నై అనడం, చంద్రబాబు సై చెప్పడంతో ఇక సైకిల్ సవారీ షురూ కాకతప్పదనే ప్రచారం ఊపందుకుంది. అయితే కందుకూరులో ఇప్పటికే పోతుల రామారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా , దివి శివరాం మాజీ ఎమ్మెల్యేగా టికెట్ రేసులో ఉన్నారు. వారిద్దరినీ కాదని మానుగంట వైపు చంద్రబాబు మొగ్గితే టీడీపీ వ్యవహారాలు చర్చనీయాంశం అవుతాయి. అలాంటి పరిస్థితిని అధికార పార్టీ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. అయితే మానుగంటని ఎమ్మెల్సీ చేయడానికి మాత్రమే చంద్రబాబు అంగీకరించారని టీడీపీలోని ఓ వర్గం ప్రచారం చేస్తుండడం విశేషం.

మానుగుంటకు తోడుగా ముక్కు ఉగ్రనరసింహరెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. కనిగిరి నియోజకవర్గంలో సామాజిక సమీకరణాల రీత్యా జగన్ అక్కడ కూడా ఉగ్ర నరసింహకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆయన కూడా ప్రత్యామ్నాయంగా టీడీపీ వైపు చూస్తున్నారు. సామాజిక సమీకరణాల రీత్యా ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజికవర్గం నేతలు టీడీపీ లో చేరడం అత్యవసరం అని భావిస్తున్న చంద్రబాబు ఉగ్రతో కూడా టచ్ లో ఉండాలని టీడీపీ నేతలను ఆదేశించారు. దాంతో కనిగిరి పరిణామాలు కూడా ఆసక్తిగా మారుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య అనుచరుడు కదిరి బాబూరావు కనిగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ని కాదని ముక్కు ఉగ్ర నరసింహరెడ్డిని ముందుకు తెస్తే ఎలాంటి పరిణామాలుంటాయన్నది చూడాలి. ఏమయినా ఇద్దరు మాజీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాుగతోంది. అదే జరిగితే ఏదో మేరకు వైసీపీకి నష్టం తప్పదనే అంచనాలు కూడా కనిపిస్తున్నాయి.


Related News

MLC-polls-turned-into-a-proxy-war’-between-Chandrababu-Jagan-in-Kadapa-768x512

జగన్ నై: బాబు సై! ఆ ఇద్దరూ రయ్

Spread the love రాష్టంలొ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నేతలంతా సురక్షిత స్థానాల కోసం చూసుకుంటున్నారు.Read More

bjp-tdp

టీడీపీ, బీజేపీ డిష్షుం..డిష్షుం..!

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం చేత‌ల వ‌ర‌కూ వ‌చ్చేస్తోంది. బాల‌య్య కామెంట్స్ తో రాజుకున్న కాకRead More

 • ఆనం ప‌రిస్థితి విషమం
 • టీడీపీ అబ‌ద్ధం చెప్పిందా…?
 • వైసీపీకి ఊర‌ట‌: టీడీపీ ఆశ‌లు గ‌ల్లంతు
 • ద‌ర్శి జ‌గ‌న్ ని ద‌రిచేరుస్తుందా…?
 • ఆమంచివి మూయించారు..
 • వ‌ర్గ‌పోరుతో వైసీపీ స‌త‌మ‌తం
 • టీడీపీకి యువ నేత రాజీనామా
 • టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *