Main Menu

వైసీపీలో క‌ల‌క‌లం

Spread the love

కావలి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సస్పెన్షన్ వివాదం సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు అనంతరాజు బాలకృష్ణంరాజు, ఊటు అశోక్‌కుమార్‌రెడ్డి, పప్పు సుధాకర్, ఎరటిపల్లి శేఖర్‌రెడ్డిలను గతంలో పార్టీనుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలలో కావలి అసెంబ్లీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బరిలో ఉంటాడంటూ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేసిన ప్రకటన అప్పట్లో విష్ణు వర్గానికి ఆగ్రహం కలిగించింది. అభ్యర్థిని ప్రకటించడానికి మేకపాటి ఎవరంటూ విష్ణువర్గం బహిరంగ విమర్శలకు దిగడంతో నలుగురిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వారిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వారికి నోటీసులు అందాయి.

అప్పటి నుంచి విష్ణు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్రలో సైతం పాల్గొనలేదు. విష్ణుని శాంతిపజేసి పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించేలా చేసేందుకు అధిష్టానం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన మాత్రం తన అనుచరులపై సస్పెన్షన్ ఎత్తివేసాకే మిగతా విషయాలు మాట్లాడుతానంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విష్ణు అనుచరులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇక పార్టీలో వర్గాలు లేకుండా అందరూ కలసి పనిచేస్తారని కార్యకర్తలు ఆశపడ్డారు. కానీ సస్పెన్షన్‌కు సంబంధించిన నోటీసులు జిల్లా కార్యాలయం నుంచి వచ్చాయని, సస్పెన్షన్ ఎత్తివేత విషయం మాత్రం రామిరెడ్డి తెలపడం ఏమిటని విష్ణు అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాపార్టీ కార్యాలయం నుంచి గానీ, లేదా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డిగానీ ప్రకటన చేస్తే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయంలో విష్ణు సైతం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. విష్ణువర్ధన్‌రెడ్డి తీసుకునే నిర్ణయం కోసం ఆయన అనుచరులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం అల్లూరులో విష్ణుతో భేటీకానున్నారు. కావలి అభ్యర్థిత్వంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇటీవల కావలిలో జరిగిన నియోజకవర్గ బూత్‌కమిటీ సమావేశంలో చేసిన వ్యాఖ్యల పట్ల ఈ ఇద్దరు నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పదేపదే మేకపాటి కావలి అభ్యర్థి రామిరెడ్డి అంటూ ప్రకటించటంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్ రాజకీయంపై వీరు ఇరువురు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారి అనుచరులు అంటున్నారు.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *