వైసీపీలో ముదురుతున్న విబేధాలు

1736_ysrcp
Spread the love

వైసీపీకి పట్టున్న జిల్లాల్లో రాయలసీమ తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలే కనిపిస్తాయి. గడిచిన ఎన్నికల్లో కొన్ని సీట్లు చేజేతులా పొగొట్టుకున్నప్పటికీ నేటికీ మంచి పట్టు ఉన్న జిల్లాలివి. మెజార్టీ సీట్లు గెలుచుకున్న జిల్లాల్లో దానికి తగ్గట్టుగా బలపడడంలో వైసీపీ నాయకత్వం విఫలవుతోంది. దానికి ప్రధానకారణం పార్టీలో వర్గపోరు అని చెప్పవచ్చు. ఉదాహరణకు మంత్రి శిద్ధా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో వైసీపీలో ముదురుతున్న విబేధాలు గమనిస్తే ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. వాస్తవంగా బలమైన నాయకత్వం ఉండి కూడా వైసీపీకి ఇక్కట్లు తప్పడం లేదు.

ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. అదే సమయంలో ప్రస్తుత ఇన్‌చార్జీ బాదం మాధవరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాంతో ఇరు వర్గాలు రెండు గ్రూపులుగా ఏర్పడి పార్టీ కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రజాసంకల్పయాత్ర సన్నాహాలు కూడా విడివిడిగా సాగిస్తూ పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నారు. దాంతో జగన్ రాక సందర్భంగా జనసమీకరణలో విబేధాలు స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే అధినేత ఏరకంగా స్పందిస్తారు, జనం ఎలా భావిస్తారన్నది వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.


Related News

anam

ఆనం ప‌రిస్థితి విషమం

Spread the loveమాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి ప‌రిస్థితి విష‌మంగా మారింది. ఆయ‌న ఆరోగ్యRead More

Hyderabad: TDP President N Chandrababu Naidu's son Nara Lokesh is felicitated on the first day of the party's Mahanadu at Gandipet near Hyderabad on Wednesday. PTI Photo (PTI5_27_2015_000150A)

టీడీపీ అబ‌ద్ధం చెప్పిందా…?

Spread the loveహ‌స్తిన కేంద్రంగా రాజ‌కీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మ‌ధ్య హోరాహోరీగా న‌డుస్తోంది. ఆధిప‌త్యం కోసం తీవ్రంగాRead More

 • వైసీపీకి ఊర‌ట‌: టీడీపీ ఆశ‌లు గ‌ల్లంతు
 • ద‌ర్శి జ‌గ‌న్ ని ద‌రిచేరుస్తుందా…?
 • ఆమంచివి మూయించారు..
 • వ‌ర్గ‌పోరుతో వైసీపీ స‌త‌మ‌తం
 • టీడీపీకి యువ నేత రాజీనామా
 • టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్
 • వైసీపీలో ముదురుతున్న విబేధాలు
 • టీడీపీలో కలకలం కేసులో మేయర్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *