Main Menu

ద‌ర్శి జ‌గ‌న్ ని ద‌రిచేరుస్తుందా…?

badam madhava reddy
Spread the love

ఇప్ప‌టికే క‌ర్నూలు , చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. వచ్చే ఎన్నిక‌ల్లో ఆయా స్థానాల నుంచి పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. తాజాగా ఈసారి ప్ర‌కాశం జిల్లాలో అది ద‌ర్శి వంతు వ‌చ్చింది. ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ గెలిచిన మూడు స్థానాల్లో ద‌ర్శి ఒక‌టి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌ర్శి సీటుకి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం జ‌గ‌న్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యంగా క‌నిపిస్తోంది.

అయితే ద‌ర్శిలో బూచేప‌ల్లి కుటుంబాన్ని కాద‌ని, కొత్త‌గా మాధ‌వ్ ని ఎంపిక చేయ‌డం ద్వారా జ‌గ‌న్ నిర్ణ‌యం ఫ‌లిస్తుందా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ రెండు వ‌ర్గాలుగా విడిపోయింది. బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి అనేక మార్లు అల‌క‌పాన్పు ఎక్క‌డం, ఆత‌ర్వాత మ‌ళ్లీ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌డం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ని ప‌క్క‌న పెట్టి మాధ‌వ్ ని ముందుకు తీసుకొచ్చిన జ‌గ‌న్ కొత్త ఎత్తులు వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో క‌న్ఫ్యూజ‌న్ ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో త‌న‌కు ఆప్తుడ‌యిన శివ పోటీ చేయ‌లేన‌ని చెప్ప‌డంతో ఆయ‌న స్థానంలో మాధ‌వ్ ని ముందుకు తెచ్చిన‌ట్టు జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

బాదం మాధ‌వ‌రెడ్డి అభ్య‌ర్థిత్వం ఖ‌రారు కావ‌డంతో ఇప్పుడు ప‌రిణామాలు వేగంగా మారే అవ‌కాశం ఉంది. అయితే శివ‌ప్ర‌సాద్ స‌హ‌కారం ఏమేర‌కు ఉంటుంద‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. బూచేప‌ల్లి కుటుంబం స‌హ‌కారం లేకుండా మాధ‌వ్ ముందుకెళ్లాలంటే అది ఏటికి ఎదురీతే అవుతుంది. దాంతో శివ కుటుంబాన్ని సన్నిహితంగా మ‌ల‌చుకోవ‌డాన్ని బ‌ట్టే మంత్రిని ఢీకొట్ట‌బోతున్నమాధ‌వ్ కి విజ‌యావ‌కాశాలుంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు.






Related News

nellore

టీడీపీలో నాలుగుస్తంభాల‌ట‌

Spread the loveనెల్లూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు ఉధృత‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు ఈ ఉక్క‌పోత భ‌రించ‌లేక టీడీపీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నారు.Read More

tdp

టీడీపీని వీడిపోతున్నా…!

Spread the loveతెలుగుదేశం పార్టీ నుంచి సీనియ‌ర్ నేత జారిపోవ‌డం ఖాయం అయ్యింది. గుర్తింపు లేని చోట తానుండలేన‌ని మాజీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *