Main Menu

వైసీపీ మ‌రో అభ్య‌ర్థి ఖాయం

Spread the love

వైసీపీ అధినేత వ్యూహాత్మ‌కంగా సాగ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే అడుగులు వేస్తున్న‌ట్టు తాజా ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. అదే క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి అసెంబ్లీ స్థానానికి అభ్య‌ర్థి విష‌యంలో కొత్త నేత తెర‌మీద‌కు రావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇప్ప‌టికే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి, మాధ‌వ రెడ్డి వంటి వారు తెర‌మీద‌కు రాగా తాజాగా మ‌రో పారిశ్రామిక‌వేత్త పేరు వినిపిస్తోంది. తాను పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని వ్యాపారవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్‌ స్పష్టం చేయ‌డం ఆస‌క్తిగా మారింది. ఆపార్టీ అధినేత జగన్‌ను కలిసి ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. వెంటనే రంగంలోకి రావాలని జగన్‌ ఆయనకు సూచించగా సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తానని వేణుగోపాల్‌ బదులిచ్చినట్లు సమాచారం.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దర్శి నుంచి పోటీ చేసిన వేణుగోపాల్‌ అంగీకరిస్తే ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించాలని నెల క్రితమే జగన్‌ నిర్ణయించుకున్నారు. వైసీపీ దర్శి బాధ్యతలు చేపట్టేందుకు వేణు గోపాల్‌ సన్నద్ధం కావడంతో నియోజకవర్గంలో పార్టీకి శుభసూచికంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే బూచేప‌ల్లి స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.






Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *