Main Menu

కొట్లాట‌కు దిగిన వైసీపీ నేత‌లు

Spread the love

వైసీపీ నేత‌లు వీరంగం చేశారు. న‌డి రోడ్డుపై రెచ్చిపోయారు. ఆధిప‌త్య పోరుతో అల‌జ‌డి రేపారు. దాంతో నెల్లూరు జిల్లా గూడూరు రాజ‌కీయాలు హీటెక్కాయి. విప‌క్ష నేత‌పై దాడికి నిర‌స‌న‌గా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం సాక్షిగా వైసీపీ నేత‌ల మ‌ధ్య విబేధాలు రోడ్డెక్కాయి. బాహాబాహీగా దారితీశాయి. దాంతో ఈ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది.

గూడూరులోని వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో జ‌గ‌న్ ఆరోగ్యం కోసం పూజ‌లు నిర్వ‌హించిన ఈ సంద‌ర్భంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మాజీ మునిసిప‌ల్ చైర్మ‌న్ భ‌ర్త వీరారెడ్డి , పార్టీ సీనియ‌ర్ నేత గోపాల్ రెడ్డి మ‌ధ్య వివాదం ర‌చ్చ‌రచ్చ‌గా మారింది. ఇరువ‌ర్గాల మ‌ధ్య కొట్లాట‌కు దారితీసింది. దాంతో మిగిలిన నేత‌లు వారికి స‌ర్థిచెప్పాల్సి వ‌చ్చింది.

నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ మేరుగ ముర‌ళీ కూడా ఈ విష‌యంలో స‌మ‌గ్రంగా స్పందించ‌లేక‌పోతున్నార‌నే అబిప్రాయం ఉంది. పార్టీలో విబేధాల‌ను ప‌రిష్క‌రించ‌డంలో జ‌రిగిన జాప్యం చివ‌ర‌కు ప‌రువు తీసే వ‌ర‌కూ వ‌చ్చింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *