Main Menu

టీడీపీకి గుడ్ బై అంటున్న ఎమ్మెల్యే

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల‌కు ఎన్నిక‌ల సెగ త‌గిలింది. ఇప్ప‌టికే తెలంగాణాలో ప్ర‌చారం ఊపందుకోగా , ఏపీలో వేడి రాజుకుంటోంది. దానికి త‌గ్గ‌ట్టుగా నేత‌లు సుర‌క్షిత స్థానాల వైపు క‌న్నేస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అదే బాటు ప‌డుతున్నారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

మాజీ సీఎం రోశ‌య్య‌కు రాజ‌కీయంగా శిష్యుడు లాంటి ఆమంచికి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టు ఉంది. దాంతో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. 2009లో కాంగ్రెస్, 2014లో న‌వోద‌య పార్టీ పేరుతో ఇండిపెండెంట్ గా గెలిచి, ఆ త‌ర్వాత టీడీపీ పంచ‌న చేరిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌పై క‌న్నేశారు

రాబోయే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి త‌గ్గ‌ట్టుగా త‌న‌కు టీడీపీ ప‌రిస్థితి ఉప‌యోగ‌ప‌డ‌ద‌న్న అంచ‌నాలో ఆమంచి ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త త‌న కొంప ముంచుతుందనే ఆలోచ‌న‌కు వ‌చ్చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే వైసీపీలో చేరాలా..లేక జ‌న‌సేన కు జై కొట్టాలా అన్న‌ది ఆయ‌న తేల్చుకోలేని అంశంగా మారింది. ఇప్ప‌టికే ఇరు పార్టీల నేత‌లు ఆమంచి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీడీపీ నేత‌లు కూడా చేజారిపోకుండా చూసుకోవ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు

ఇటీవ‌ల అనూహ్యంగా ఆమంచి వెళ్లి జ‌గ‌న్ తో భేటీ అయ్యార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. చివ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు కూడా ఆరా తీసేవ‌ర‌కూ వెళ్లింది. అయితే ఆమంచి మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. పార్టీ మార‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే ఏ జెండా ప‌ట్టాల‌న్న‌దే ఆయ‌న‌కు స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో మ‌రికొద్ది రోజులు వేచి చూసే ధోర‌ణి అవ‌లంభించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *