చంద్ర‌బాబు కోపం వ‌చ్చింది..!

Ongole, Andhra Pradesh April 20, 2014, Sunday caption: TDP President N.Chandrababu Naidu celebrates his birthday with party leaders and workers in Chirala on Sunday.
photo: Kommuri Srinivas
Spread the love

అద్దంకి వ్య‌వ‌హారం హాట్ హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ వ్య‌వ‌హారాల్లో పెను దుమారం దిశ‌గా సాగుతోంది. అద్దంకి వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌బోన‌ని మాట ఇచ్చి ఎమ్మెల్సీ ప‌ద‌వి తీసుకున్న క‌ర‌ణం బ‌ల‌రాం వ్య‌వ‌హారం చంద్ర‌బాబు కి కోపం ర‌ప్పించిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌కాశం జిల్లాలో పార్టీ ప‌రిణామాల‌పై ఆందోళ‌న చెందుతున్న చంద్ర‌బాబు తాజాగా స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో అద్దంకి నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కరణం బలరాం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అద్దంకి నియోజక వర్గంలో కరణం బలరాం మాట చెల్లదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆ నియోజకవర్గంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పిందే ఫైనల్ అని తేల్చేశారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ ఇచ్చిన సమయంలోనే ఈ విషయం చెప్పినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. అయితే అప్పుడు అంగీకరించిన బలరాం ఇప్పుడు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా గొట్టిపాటి, కరణం వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పుడుతున్న విషయం తెలిసిందే. విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన చంద్రబాబు.. అద్దంకి నియోజక వర్గంలో మాత్రం రవికుమార్ నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయని చెప్పడం కరణం బలరాం వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం.


Related News

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the loveటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

hqdefault

రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం

Spread the loveఏపీలో అధికార పార్టీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారికితోడుగా మిత్రపక్షం నేతలు కూడా కలుస్తున్నారు.Read More

 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
 • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
 • మళ్లీ కొట్టుకున్నారు..
 • ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *