Main Menu

‘రెడ్డి’కి చేరువ‌య్యేందుకు చంద్ర‌న్న‌య‌త్నం!

Spread the love

గత ఎన్నికల్లో తమకు దూరమైన రెడ్డి వర్గాన్ని తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా రెడ్లకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలనే ప్రతిపాదన ఆయన ముందు ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ, సామాజిక రంగాల్లో వారే ఇప్పటివరకూ ముందు వరుసలో ఉంటూ వస్తున్నారు. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రెండు ఎస్సీ రిజర్వుడు మినహాయించి మిగతా 8 చోట్ల ప్రధాన పార్టీలు రెడ్లకే ఎక్కువగా సీట్లిస్తూ వస్తుంటాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ అత్యధికంగా ఆరు స్థానాల్లో రెడ్లకు సీట్లిచ్చింది. టీడీపీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తూ మూడు చోట్ల అవకాశం కల్పించింది. కానీ ఈసారి మరో స్థానం కూడా రెడ్లకు కేటాయించాలనే డిమాండ్ పార్టీలోనూ పెరుగుతోంది. ఓ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారనే అపవాదు చెరిపివేసుకోవాలనే భావనలో టీడీపీ కనపడుతోంది. ప్రతిపక్ష పార్టీపైన కూడా అదే విధంగా ఓ సామాజిక వర్గ ముద్ర పడినప్పటికీ, ఆ అంశంతో సంబంధం లేకుండా టీడీపీ అందరి పార్టీ అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే జిల్లాలో మరో రెండు చోట్ల కూడా రెడ్లకు అవకాశం కల్పించాలని టీడీపీ అధినాయకత్వం గత కొంత కాలంగా సమాలోచనలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జిల్లాలో రెడ్లకు కేటాయించే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో నెల్లూరురూరల్, ఆత్మకూరు, ఉదయగిరిలు కనిపిస్తున్నాయి. అయితే ఆత్మకూరు టికెట్ తనకు ఖరారైందంటూ బొల్లినేని కృష్ణయ్య స్వయంగా ప్రకటించుకుంటూ గ్రామాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను కలుస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నుండి కూడా ఆయనకు స్పష్టమైన హామీ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలో చేరి ఇక్కడ నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న బొమ్మిరెడ్డికి టీడీపీలో ఎటువంటి గుర్తింపు వస్తుందో తెలియడం లేదు. ఉదయగిరి నుండి ఈ సారి ఖచ్చితంగా రెడ్లకు టీడీపీ నుండి పోటీ చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అగ్రస్థానాన నిలబడే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో మాత్రం వెనకబడి ఉంటున్నారనే విమర్శలున్నాయి. పార్టీ అంతర్గత సర్వేలోనూ ఆయన పట్ల ప్రజల్లో సుముఖత వ్యక్తం కాలేదంటూ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ అభ్యర్థిని మార్చాలని ముఖ్యమంత్రి భావిస్తే తొలి ప్రత్యామ్నాయంగా జలదంకి మండలానికి చెందిన కావ్య కృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, కృష్ణారెడ్డికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. నియోజకవర్గంలో తరచూ తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ, మరోవైపు అమరావతి స్థాయిలో తన ప్రయత్నాలను ఆయన ముమ్మరం చేసుకుంటున్నారు. రెడ్లకు అవకాశం ఇచ్చినంత మాత్రాన టీడీపీ తొలి నుండి తమ పార్టీగా భావిస్తూ వచ్చిన కమ్మ ఓట్లు ఎలాగూ పడకుండా పోయని, అదనంగా రెడ్లలోనూ టీడీపీ కొందరి పార్టీ కాదనే భావన కల్పించిన వారవుతారని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. అలాగే నెల్లూరురూరల్ నుండి బీద రవిచంద్రకు అవకాశం కల్పిస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీద రవిచంద్ర కాని పక్షంలో ఇక్కడ నుండి కూడా రెడ్డికే పోటీ అవకాశం ఉంటుందని జిల్లా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎలాగైనా ఈ దఫా ఎన్నికల్లో జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకోవడం ద్వారా గెలుపు సంఖ్యను పెంచుకోవాలని చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.


Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *