Main Menu

టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్ కి రంగం సిద్ధం

Spread the love

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న వ్య‌వ‌హారాలు వెలుగులోకి వ‌స్తాయి. తాజాగా వ్య‌వ‌హారం అరెస్ట్ వ‌ర‌కూ వెళుతున్న‌ట్టు క‌థ‌నాలు వినిపిస్త‌న్నాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లో 8 కేసులు, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో మ‌రో కేసు ఆయ‌న మీద కొన‌సాగుతున్న నేప‌థ్యంలో నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి క‌ష్టాలు త‌ప్పేలా లేవు

ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మాణంలో 20వేల కోట్ల రూపాయాలు అవినీతి జ‌రిగిన‌ట్టు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ధారించింది. ఈ వ్య‌వ‌హారంలో కాంట్రాక్ట‌ర్ బొల్లినేని రామారావు అరెస్ట్ న‌కు ఫ‌డ్న‌విస్ ప్ర‌భుత్వం అనుమ‌తులిచ్చింది. వాస్త‌వానికి గ‌తంలోనే నాగ‌పూర్ లో ఏసీబీ అధికారులు బొల్లినేని విచారించారు. అయితే హైకోర్ట్ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌తో ఆయ‌న అరెస్ట్ ఆగింది. కానీ ప్ర‌స్తుతం కోర్ట్ ఉత్త‌ర్వులు కొట్టివేయ‌డంతో ఈసారి అరెస్ట్ ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రో నేరంలో కూడా నాగ‌పూర్ పోలీసులు బొల్లినేని ని అరెస్ట్ చేసే య‌త్నంలో ఉన్నార‌ని స‌మాచారం. బొల్లినేని కి చెందిన శ్రీనివాస క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీ మీద ప‌లు ఆరోప‌ణ‌లున్నాయి. స‌బ్ కాంట్రాక్ట‌ర్ కి చెల్లించాల్సిన 209 కోట్ల రూపాయ‌లు ఎగ‌నామం పెట్టార‌నే వాద‌న కూడా ఉంది. దాంతో ఈ మొత్తం వ్య‌వ‌హారాల‌న్నీ టీడీపీ ఎమ్మెల్యేను చిక్కుల్లో నెడుతున్నాయి. ఎమ్మెల్యే అరెస్ట్ అయితే ఎన్నిక‌ల ముంగిట తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ కాగ‌ల‌దు. దాంతో బొల్లినేని కోసం కొంత రాజీయ‌త్నాలు జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంచ‌నాలు వేస్తున్నారు.






Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *