Main Menu

టీడీపీలో కొత్త మంట‌

Spread the love

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిన చంద్ర‌బాబు ప‌లువురు నేత‌ల‌కు టికెట్లు ఖ‌రారు చేస్తున్నారు. కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థిత్వాలు ముందుగా ఖ‌రారు చేస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్నూలు ఎమ్మెల్యే సీటుని ఎస్వీ మోహ‌న్ రెడ్డికి ఖాయం చేస్తూ లోకేష్ ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అంత‌కుముందు మండ‌పేట సీటుని వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావుకి, జ‌గ్గంపేట సీటు జ్యోతుల నెహ్రూకి ఖరారు చేస్తూ బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. అయితే వాళ్లంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా స్ప‌ష్ట‌త కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. న‌గ‌రి సీటు విష‌యంలో గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుటుంబానికి ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చిన చంద్ర‌బాబు తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు సీటుపై స్ప‌ష్ట‌త ఇచ్చేశారు..

ప్ర‌స్తుతం ఆత్మ‌కూరు స్థానం వైసీపీ చేతిలో ఉంది. మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఏద‌యినా అనూహ్య మార్పులుంటే త‌ప్ప ఈ సీటులో మ‌రోసారి గౌత‌మ్ రెడ్డి బ‌రిలో దిగ‌డం ఖాయం. ఆయ‌న‌కు పోటీగా టీడీపీ త‌రుపున ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని రంగంలో దింప‌వ‌చ్చ‌ని అంతా ఆశించారు. అయితే ఆదాల మాత్రం స‌ర్వేప‌ల్లి స్థానం మీద క‌న్నేసిన త‌రుణంలో ఆత్మ‌కూరుకి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణ‌య్య పేరు దాదాపు ఖాయం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని బ‌ల‌మైన నేత‌గా చంద్ర‌బాబు కూడా భావిస్తున్నారు. దాంతో స్వ‌యంగా బొల్లినేని ద‌గ్గ‌రుండి చంద్ర‌బాబు ద‌గ్గ‌రికి తీసుకెళ్ళిన ఆదాల ఆత్మ‌కూరిని ఆయ‌న‌కు ఖాయం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ ప‌రిణామాల‌తో ఆత్మ‌కూరు టీడీపీలో మంట త‌ప్ప‌ద‌ని ప్ర‌చారం సాగుతోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో పోటీ చేసిన క‌న్న‌బాబు మ‌రోసారి అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆదాల తీరు మీద ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక ఇప్పుడు బొల్లినేనికి బెర్త్ ఖాయం చేశార‌నే ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో క‌న్న‌బాబు క‌న్నెర్ర చేస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న్ని సంతృప్తి ప‌ర‌చ‌డానికి చంద్ర‌బాబు ఏం చేస్తార‌న్న దానిని బ‌ట్టి ఆత్మ‌కూరు టీడీపీలో ఏమేర‌కు అగ్గి రాజుకుంటుంద‌న్న‌ది ఆధార‌ప‌డి ఉంటుంది.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *