రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం

hqdefault
Spread the love

ఏపీలో అధికార పార్టీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారికితోడుగా మిత్రపక్షం నేతలు కూడా కలుస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో బీజేపీ సీనియర్ నాయకుడు విధ్వంసం స్రుష్టించారు. వీరంగం చేశారు. టోల్ గేట్ వద్ద దౌర్జన్యం చేశారు. సిబ్బంది మీద దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందడం కలకలం రేపుతోంది. దాంతో బీజేపీ నాయకుడు సురేష్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

‘రేయ్‌…సురేష్‌రెడ్డి వస్తే గేటు తీయరా…ఏందిరా వాడిని అడిగేది…గేట్లు విరగ్గొట్టు…కౌంటర్‌ అద్దాలు పగులగొట్టు’ అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురే్‌షరెడ్డి అనుచరులు టోల్‌గేట్‌ వద్ద బీభత్సం సృష్టించారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి దౌర్జన్యం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసుకోవాలని టోల్‌గేటు నిర్వాహకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘నువ్వేమి చేసుకుంటావో చేసుకో…నష్ట పరిహారం ఇచ్చేది లేదు’ అంటూ సురేష్‌రెడ్డి నిర్వాహకులతో దురుసుగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంకటాచలం పోలీసులు పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురే్‌షరెడ్డి ఆయన అనుచరులు శనివారం ఉదయం ఐదు కార్లలో బయలుదేరారు. వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ టోల్‌ప్లాజా ఫ్రీ గేట్లు వద్ద కార్లు ఆగాయి. గేట్లు ఎత్తాలని సిబ్బందిని కోరారు. ఫ్రీ పాస్‌ ఉంటే తప్ప గేట్లు ఎత్తలేమని సెక్యూరిటీ సిబ్బంది బదులిచ్చారు. దాంతో మొదలయిన వివాదం చినికి చినికి గాలివానలా మారి ఇప్పుడు పోలీసులకు చేరింది. సురేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిందేనని టోల్ గేట్ నిర్వాహకులు కోరుతున్నారు.






Related News

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the loveటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

hqdefault

రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం

Spread the loveఏపీలో అధికార పార్టీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారికితోడుగా మిత్రపక్షం నేతలు కూడా కలుస్తున్నారు.Read More

  • అద్దంకి గరటయ్యదే..
  • బూచేపల్లికి బుజ్జగింపు
  • టీడీపీకి నీటి గండం
  • వైసీపీ లో వార్
  • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
  • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
  • మళ్లీ కొట్టుకున్నారు..
  • ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *