Main Menu

టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ

bjp-tdp
Spread the love

టీడీపీ, బీజేపీ బంధం రానురాను బలహీనపడుతోంది. తాజాగా మిత్రపక్షం తీరుపై కమలదళం రోడ్డెక్కింది. ఆందోళనకు దిగింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ నేతల వ్యవహారంపై బీజేపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. నెల్లూరులో సాగించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. గాంధీ బొమ్మ దగ్గర మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ నేతలు విషప్రచారాన్ని ఆపాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ పెద్దల తీరును తప్పుబట్టారు.

బీజేపీ ఆందోళనతో ఆగ్రహించిన తెలుగుతమ్ముళ్లు కూడా పోటీ ధర్నా చేపట్టాలని భావిస్తున్నారు. తమ నేతల దిష్టిబొమ్మలను దహనం చేయడంపై గుర్రుగా ఉన్నారు. బీజేపీ వ్యవహారంపై మండిపడుతున్నారు. దాంతో వారి వ్యవహారం కొత్త వేడి రాజేస్తోంది.






Related News

tdp

టీడీపీని వీడిపోతున్నా…!

Spread the loveతెలుగుదేశం పార్టీ నుంచి సీనియ‌ర్ నేత జారిపోవ‌డం ఖాయం అయ్యింది. గుర్తింపు లేని చోట తానుండలేన‌ని మాజీRead More

nellore

ఆ ఇద్దరూ అవుట్, టీడీపీలో కలవరం

Spread the loveతెలుగుదేశం పార్టీలో రానురాను సమస్యలు తీవ్రమవుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా సేఫ్ జోన్ చూసుకుంటుండడంతో పార్టీకి పెద్ద సమస్యగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *