గిద్ద‌లూరు టీడీపీ క‌ట్ట‌లు తెంచుకుంది..!

anne rambabu
Spread the love

తెలుగుదేశం ఇంటి గుట్టు వీధిన ప‌డుతోంది. చాలాకాలంగా ఓపికగా ఉన్న నేత‌లు కూడా తాజాగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న వ్య‌వ‌హారం ముగిసిపోయింద‌ని తేల‌డంతో ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా ఈ వ్య‌వ‌హారం గిద్ద‌లూరులో తెర‌మీద‌కు వ‌చ్చింది. టీడీపీ అంత‌ర్గ‌త పోరు క‌ట్టు త‌ప్పింది. పార్టీలో గంద‌ర‌గోళం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఫిరాయింపుల వ్య‌వ‌హారం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అదే స‌మ‌యంలో ముత్తంరెడ్డి అశోక్ రెడ్డి కేసులు కొట్టివేస్తున్న తీరును కోర్టు కూడా త‌ప్పుబ‌ట్టింది, అవ‌న్నీ ఓ క్ర‌మంలో సాగుతుండ‌గానే తాజాగా గిద్ద‌లూరులో అశోక్ రెడ్డి, అన్నే రాంబాబు వైరం ముదిరి పాకాన‌ప‌డింది. చివ‌ర‌కు అన్నే రాంబాబు రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపారు. అస‌లే కాక‌మీదున్న పార్టీలో కొత్త వివాదం రాజేశారు.

ప్ర‌కాశం జిల్లా టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పి కుంప‌టి నెత్తినెట్టుకున్న‌ట్టయ్యింది. ఆమంచి ని తెచ్చుకుని చీరాల‌లో చిచ్చు పెట్టుకున్న టీడీపీ, అద్దంకిలో ఎటూ పాలుపోని స్థితిలో ఇరుక్కుంది. ఇక గిద్ద‌లూరు వ్య‌వ‌హారం గ‌రంగ‌రం గా మార్చేసుకుంది. కందుకూరులో కొత్త కాక రాజేసింది. దాంతో ఆపార్టీకి ఇప్పుడు ఊపిరిస‌ల‌ప‌డం లేదు. అదే స‌మ‌యంలో అన్నే రాంబాబు వ్య‌వ‌హారం అల‌జ‌డి రేపుతోంది. ఆయ‌న రాజీనామా చేయ‌డంతో అన్నే వ‌ర్గీయులు ఇప్పుడు త‌మ భ‌విష్య‌త్తు గురించి ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ప్ర‌త్య‌ర్థి పార్టీతో చేతులు క‌లుపుతారా అనే విష‌యం టీడీపీలో క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు గాలం వేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌డంతో గిద్ద‌లూరు మ‌రో హాట్ టాపిక్ గా మారుతోంది.

వాస్త‌వానికి ప్ర‌కాశం జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా సంతృప్తిగా క‌నిపించ‌డం లేదు. కానీ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ‌కు చికాకుగా మారిన సీనియ‌ర్ త‌మ్ముళ్ళ తీరును ఓపిక‌గా భ‌రిస్తూ వ‌స్తున్నారు. అందుకోస‌మే అన్న‌ట్టుగా ఐదుగురు ఫిరాయింపుదారులు క‌లిసి ఉమ్మ‌డిగా సాగుతున్నారు. దాంతో తెలుగుదేశం జిల్లా వ్యాప్తంగానే రెండుముక్క‌ల‌యిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అదే అద్దంకిలో క‌ర‌ణం కుటుంబానికి, గిద్ద‌లూరులో అన్నే రాంబాబు ఆగ్ర‌హానికి కార‌ణం అవుతోంది. ఇక ఇప్పుడు వీరంతా పార్టీలో ఓపిక ప‌ట్ట‌లేక‌పోతున్నారు కాబ‌ట్టి ప‌రిణామాలు ఎటు దారితీసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది ప‌రిశీల‌కుల అంచ‌నా.


Related News

1736_ysrcp

వైసీపీలో ముదురుతున్న విబేధాలు

Spread the loveవైసీపీకి పట్టున్న జిల్లాల్లో రాయలసీమ తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలే కనిపిస్తాయి. గడిచిన ఎన్నికల్లో కొన్ని సీట్లుRead More

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the loveటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

 • రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం
 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
 • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
 • మళ్లీ కొట్టుకున్నారు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *