ఆనం పరిస్థితి విషమం

మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని కిమ్స్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆరాతీసిన చంద్రబాబు , స్వయంగా ఆయన్ని పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
నెల్లూరు జిల్లాకి చెందిన ఆనం వివేకానందరెడ్డి ఏపీ రాజకీయాల్లో ఓ భిన్నమైన నేత. వాక్చాతుర్యం, విచిత్ర వేషధారణలతో అందరినీ ఆకట్టుకునే వారు. సుదీర్ఘకాలం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ లో కొనసాగారు. కానీ రెండేళ్ల క్రితం మళ్లీ టీడీపీ గూటికి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో తనయుడికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆనం బ్రదర్స్ గా నిత్యం రాజకీయ వర్గాల్లో ఆకర్షణగా కనిపించేవారు. అయితే సిగరెట్ స్మోకింగ్ మూలంగా ఆయనకు ఆరోగ్య సమస్యలు పెరిగినట్టు వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.
Related News

ఆనం పరిస్థితి విషమం
Spread the loveమాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆరోగ్యRead More

టీడీపీ అబద్ధం చెప్పిందా…?
Spread the loveహస్తిన కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీగా నడుస్తోంది. ఆధిపత్యం కోసం తీవ్రంగాRead More