Main Menu

ఆనం బ్ర‌ద‌ర్స్ ని మోసం చేసిందెవ‌రు..?

Anam Brothers
Spread the love

అయ్యో..అనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. రాజ‌కీయాల్లో అంతెత్తుకు ఎదిగిన వాళ్ల‌కు అన్యాయం జ‌రుగుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ప‌డిపోవ‌డం అనూహ్య‌మే అనిపిస్తోంది. అయినా పోలిటిక్స్ లో ఇలాంటి సీన్లు త‌ప్ప‌వేమో అని స‌రిపెట్టుకోవాలి. బ‌ళ్లు ఓడ‌లు..ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం అంటే ఏమిటో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే అంతా తామై అన్నింటా పెత్త‌నం చెలాయించిన ఆనం బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు మోస‌పోయామ‌ని వాపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. స్వ‌యంగా ఆనం వివేకానంద‌రెడ్డి తాము మోస‌పోయామ‌ని చెప్పిన నేప‌థ్యంలో అస‌లు ఇంత‌కీ వాళ్ల‌ని మోస‌గించిందెవ‌రనే చ‌ర్చ మొద‌ల‌య్యింది.

‘మోసపోయాం బ్రదర్‌.. ఎన్ని అవమానాలను భరిస్తాం. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా.. అది కూడా చేజారింది. సొంత కళాశాల వీఆర్సీలో జూనియర్‌ కళాశాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేదు. భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడు. ఇక ఇప్పట్లో నెల్లూరుకు రాలేను’… ఇవీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మాట‌లు. సింహపురి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని మూడు దశాబ్దాలకు పైగా నెల్లూరులోనే ఉంటూ అందరినీ బాస్‌..అని పలకరించే వివేకా ఇప్పుడు ఏకంగా నెల్లూరు రాలేన‌ని చెప్పేయ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. వారి పరిస్థితిని చాటుతోంది.

ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు జిల్లా రాజకీయాల్లోసుదీర్ఘ రాజ‌కీయాల్లో ఎన్నో ప‌దువులు అనుభ‌వించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కోసం ఎన్నో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఏడాదిన్న‌ర క్రితం కాంగ్రెస్ వీడి టీడీపీలో చేరిన‌ప్పుడు ఇచ్చిన హామీలు అమ‌లుకాక‌పోవ‌డం వారిని మాన‌సికంగా క్షోభ‌కు గురిచేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అలాంటి మ‌నోవ్య‌ధ నుంచే ఆనం వారు ఇలాంటి మాట‌లు మాట్లాడుతున్నార‌ని అభిమానులు వాపోవాల్సి వస్తోంది. గ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఛాన్స్ రాన‌ప్పుడే కొంత క‌ల‌త చెందారు. కానీ ఇప్పుడు ఆశ‌లు పెట్టుకున్న గ‌వ‌ర్న‌ర్ కోటా సీటు కూడా ఆవిరికావ‌డంతో ఇక ఆశ‌లు నెర‌వేరే మార్గం లేక ఆందోళ‌న‌లో ప‌డిపోయారు. అంద‌రికీ దూరంగా గ‌డిపేస్తున్నారు.

ఇక ఎమ్మెల్సీ సీటు ద‌క్క‌లేద‌న్న బాధ‌కు తోడు నెల్లూరులో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో వారిని పూర్తిగా విస్మ‌రిస్తున్నారు. క‌నీసం ఆహ్వానం కూడా అంద‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు తోడు అధికారిక వ్య‌వ‌హారాల్లో గౌర‌వ సూచిక‌గానైనా స‌మాచారం అందించాల్సి ఉండ‌గా వ్య‌వ‌హారం దానికి భిన్నంగా ఉంది. దాంతో అప్ప‌ట్లో త‌మ‌కు ఎన్నో మాట‌లు చెప్పి పార్టీలో చేర్చుకున్న నారాయ‌ణ‌, నారా చంద్ర‌బాబు త‌మ‌ను నిలువునా ముంచేశార‌నే అభిప్రాయం ఆనం బ్ర‌ద‌ర్స్ లో క‌నిప‌పిస్తోంది. తాము మోస‌పోయామ‌ని బాహాటంగా చేస్తున్న వ్యాఖ్య‌లు గ‌మ‌నిస్తే న‌మ్మ‌క‌ద్రోహం జ‌రిగింద‌ని వారు బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. రాజ‌కీయ జీవితం కూడా కోల్పోయే ప‌రిస్థితి వ‌చ్చేసింద‌ని, వార‌సుల సంగ‌తి ఎలా అని మ‌ధ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే వివేకా నెల్లూరు నుంచి హైదరాబా‌ద్‌కు మకాం మార్చేశారు. టీడీపీలో చేరి తప్పు చేశాం. అంతే కాదు మోసపోయాం. ఎన్ని అవమానాలన్నీ భరిస్తాం. రాజకీయాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎవరెవరికో నాయకులకు పదవులు ఇస్తున్నారంటూ వివేకా వేదాంత ధోరణిలో సన్నిహితుల వద్ద వాపోతున్నారు. భవిష్యత్‌, కాలం దేవుడే నిర్ణయిస్తాడని పేర్కొంటూ ఇప్పట్లో నెల్లూరుకు రాలేనని, విలువ లేని చోట వచ్చి మనసు బాధ పెట్టుకోవడం సరికాదని ఆయన వెల్లడిస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి ఆనం బ్రదర్స్‌ సహాయ సహకారాలు అందిస్తారని భావించినా ఇప్పుడు వారిని ముంచేశార‌నే అభిప్రాయం నెల్లూరు వాసుల్లో క‌నిపిస్తోంది. దాంతో ఈ వ్య‌వ‌హారం సింహ‌పురి టీడీపీలో ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. రాజ‌కీయాలు ప‌రిశీలించే వారిని విస్మ‌యానికి గురిచేస్తోంది.


Related News

9173_ysrcp-3

వైసీపీ తెర‌మీద‌కు కొత్త నేత‌లు

Spread the loveవైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. రాజ‌కీయంగా జ‌గ‌న్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ల విష‌యంలోRead More

07-1457330006-28-anam-ramanarayana-reddy-600

లైన్ క్లియ‌ర్ చేస‌కున్న ఆనం

Spread the loveమాజీ మంత్రి ఆనం రామ‌నారాయణ రెడ్డికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆయ‌న వైసీపీ లో చేర‌డడం ఖాయంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *