Main Menu

ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క‌తో ఆందోళ‌న‌

Spread the love

నెల్లూరు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు సాగుతున్నాయి. పొలిటిక‌ల్ స్టార్ గా పేరున్న ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క పాన్పు వీడ‌డం లేద‌ట‌. దాంతో టీడీపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేగుతోంది. వ‌రుస‌గా నేత‌లంతా రాయ‌బారాలు న‌డుపుతున్నారు. కొత్త మంత్రి సోమిరెడ్డి నుంచి మొద‌లుకుని పాత‌మంత్రి నారాయ‌ణ వ‌ర‌కూ ఆనం బ్ర‌ద‌ర్స్ ఇంటికి క్యూ కట్టారు. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు బీదా ర‌వి చంద్ర కూడా ఆనం వారితో చ‌ర్చ‌లు జ‌రిపి వ‌చ్చారు. అయినా సీన్ లో ఛేంజ్ క‌నిపించ‌క‌పోవ‌డం క‌ల‌త చెందేలే చేస్తోంది. వ‌రుస‌గా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నుంచి చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు కూడా ఆనం వారు అంద‌నంత దూరంలో ఉండ‌డం నెల్లూరు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది.

దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ లో ఉన్న ఆనం ఫ్యామిలీ మ‌ళ్లీ ఒక‌నాటి పాత స్నేహితుడు చంద్ర‌బాబు తో చేతులు క‌ల‌ప‌డ‌మే ఒక‌ర‌కంగా సంచ‌ల‌నం. అయితే ఆసంద‌ర్భంగా బాబు వారికి రెండు హామీలిచ్చారు. అందులో ఒక‌టి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఆత్మ‌కూరు ఇన్ఛార్జ్ ని చేయ‌డం వ‌ర‌కూ అమ‌లయ్యింది. కానీ ఆనం వివేకానంద‌రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చే వ్య‌వ‌హారం మాత్రం అమ‌లు కాలేదు. దాంతో టీడీపీ నేత తీరు మీద ఆనం వ‌ర్గం ఆగ్ర‌హంగా క‌నిపిస్తోంది. త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌నే అభిప్రాయం క‌నిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు సంద‌ర్భంగా అధినేత‌కు విన్న‌వించాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్పుడు అవ‌మాన‌క‌ర రీతిలో పంపించేయ‌డం వారిని తీవ్రంగా క‌ల‌చివేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ లో ఉన్న ఆనం అనుచ‌రులు అగ్గిమీద గుగ్గిలంలా మండుతున్నారు. త‌మ నేత‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయం గురించి నెల్లూరులో టీడీపీ నేత‌ల తీరుపై మండిప‌డుతుండ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దానికితోడు ఆనం బ్ర‌ద‌ర్స్ తో నేత‌లంతా వ‌రుస‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నా వ్య‌వ‌హారం ఓ కొలిక్కిరావ‌డం లేదు. పార్టీ ప‌ద‌వులు ఇస్తామ‌ని నారాయ‌ణ వంటి వారు ఆఫ‌ర్ ఇచ్చినా పార్టీ ప‌ద‌వులు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేయ‌డంతో ఆనం వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్ప‌టికే ఈ అల‌క వ్య‌వ‌హారం అధినేత ముందుకు చేరింది. కానీ ఆయ‌న కూడా ఏమీ చేయ‌లేని స్థితిలో ఉన్న‌ట్టు స‌మాచారం. ఆనం క‌న్నా ముందు పార్టీలో చేరిన ఆదాల వంటి వారికే న్యాయం చేయ‌లేని ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు ఆనం బ్ర‌ద‌ర్స్ కి అంద‌లం ఇస్తే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే వాద‌న ఉంది. మిగిలిన నేత‌లంతా దానిని స‌హించ‌ర‌నే ఆందోళ‌న క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఆనం బ్ర‌ద‌ర్స్ దిగిరాక‌పోవ‌డం పెద్ద‌త‌ల‌నొప్పిగా త‌యార‌వుతోంది. దాంతో చంద్ర‌బాబుకి మ‌రో పెద్ద వివాద‌మే మెడ‌కు చుట్టుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.


Related News

టీడీపీ ఎమ్మెల్యేకి నాగ‌పూర్ కోర్ట్ స‌మ‌న్లు

Spread the love14Sharesటీడీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌హారాష్ట్ర‌లోని కోర్ట్ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిRead More

మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌కు ఐటీ సెగ‌

Spread the love116Sharesతెలంగాణా ఎన్నిక‌ల వేళ కొంత విరామం తీసుకున్న‌ట్టు క‌నిపించిన ఐటీ అదికారులు మ‌ళ్లీ ఝులుం విధిలించారు. మ‌రోసారిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *