అద్దంకి గరటయ్యదే..

16_Addanki
Spread the love

రాబోయే ఎన్నికలే లక్ష్యంగా అద్దంకి రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అభ్యర్థి విషయంలో కరణం, గొట్టిపాటి మధ్య తగాదా కొనసాగుతోంది. మధ్యలో వైసీపీ మాత్రం కొంత క్లారిటీ కనిపిస్తోంది. ముఖ్యంగా తమ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్యేనని దాదాపు స్పష్టం చేసేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం నిర్ధారిస్తుండడంతో అద్దంకిలో నయా పరిణామాలు వేగం పుంజుకున్నాయి. నియోజకవర్గ పార్టీ సమావేశంలో రాష్ట్ర నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్రకు రాష్టవ్య్రాప్తంగా ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.టిడిపి ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిపోయి, నాయకులు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే పేదలను ఆదుకునేందుకు ఆణిముత్యాల్లాంటి పధకాలు ప్రవేశపెడతారని, సంక్షేమ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో 2009, 2014లోను వైసిపి అభ్యర్ధులే గెలిచారని, కాని వైసిపిలో గెలిచిన వ్యక్తి స్వార్ధంతో పార్టీ మారారన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోను వైసిపి అభ్యర్ధులే గెలుస్తారన్నారు.

అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన చెంచుగరటయ్య ప్రకటించారు. అయినా వేదికపై ఉన్న నేతలు బాలినేని, మోపిదేవి సహా సజ్జల వంటి వారు దాదాపుగా సమర్థించేలా మాట్లాడడంతో గరటయ్య అనుచరుల ఉత్సాహం రెట్టింపు అయ్యింది. గతంలో చివరి క్షణంలో పార్టీ మారిన తనకు అవకాశం రాలేదని, ఈసారి మాత్రం తనకు అవకాశం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాంతో అద్దంకి రాజకీయాలు కొత్త పరిణామాలతో సాగుతున్న విషయం స్పష్టమవుతోంది.


Related News

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the loveటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

hqdefault

రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం

Spread the loveఏపీలో అధికార పార్టీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారికితోడుగా మిత్రపక్షం నేతలు కూడా కలుస్తున్నారు.Read More

 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
 • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
 • మళ్లీ కొట్టుకున్నారు..
 • ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *