Main Menu

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the love

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న త‌ర్వాత కూడా కండువాలు మార్చుకోవ‌డం విశేషంగా మారుతోంది. అంతేగాకుండా చివ‌రి వ‌ర‌కూ చంద్ర‌బాబు తో ఉండి, ఆయ‌న ద‌గ్గ‌ర మొత్తం బిల్లుల‌న్నీ క్లియ‌ర్ చేసుకున్న త‌ర్వాత వైసీపీ కండువా క‌ప్పుకున్న ఆదాల తీరు టీడీపీని పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డేసింది. త‌ట్టుకోలేని షాక్ గా మారింది

అయితే ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడేమీ కొత్త కాద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న గ‌తంలో వైఎస్సార్ తో క‌లిసి చంద్ర‌బాబుకి ఇదే రీతిలో దెబ్బ‌కొట్టారు. ఇప్పుడు జ‌గ‌న్ తో క‌లిసి సీన్ రిపీట్ చేశారు. ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి 1999లో తెలుగుదేశంలో చేరి గెలిచి మంత్రి అయ్యా రు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ఆ ముందు రోజు రాత్రి చంద్రబాబును కలిసి నేను, సోమిరెడ్డి కలిసి పని చేస్తాం, జిల్లా అంతా తిరిగి పార్టీని గెలిపిస్తామని చెప్పి తెల్లవారేసరికి జెండా మార్చేశారు. వైఎస్ పంచ‌న చేరిపోయారు.

ఇప్పుడు కూడా అదే రీతిలో టీడీపీకి టికెట్ క‌న్ఫ‌ర్మ కూడా అయ్యింది. ఆ త‌ర్వాత ఆయ‌న కండువా మార్చేశారు. లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్ ని క‌లిసి తాను నెల్లూరు ఎంపీగా బరిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అప్ప‌ట్లో వైఎస్ ప‌క్షంలో చేర‌గానే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఈసారి వైసీపీకి ఆ సెంటిమెంట్ క‌లిసి వ‌స్తుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఆదాల తీరుని మాత్రం టీడీపీ నేత‌లు స‌హించ‌లేక‌పోతున్నారు.






Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *