Main Menu

టీడీపీ ఎమ్మెల్యేపై ఏసీబీ కేసు

bollineni ramarao
Spread the love

టీడీపీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం ప‌క్క రాష్ట్రాల‌కు పాకింది. తాజాగా మ‌హారాష్ట్ర‌లో ఆపార్టీ ఎమ్మెల్యే మీద కేసు న‌మోద‌య్యింది. మ‌హారాష్ట్ర ఏసీబీ న‌మోదు చేసిన కేసులో నెల్లూరు జిల్లా కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పేరు న‌మోదు కావ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. అక్క‌డ చేప‌ట్టిన ఇరిగేష‌న్ ప‌నుల్లో సాగిన భారీ అవినీతిని గుర్తించిన ఏసీబీ ప‌లువురి మీద కేసులు పెట్టింది. అదే క్ర‌మంలో అక్క‌డ కాంట్రాక్టులు చేప‌ట్టిన బొల్లినేని రామారావు ను నిందితుడుగా న‌మోదు చేశారు. విద‌ర్భ ఇరిగేష‌న్ అథారిటీ న‌మోదు చేసిన కేసులో ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఇప్ప‌టికే నెల్లూరు జిల్లాకే చెందిన వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే వ్య‌వ‌హారం రైల్వే కాంట్రాక్ట్ విష‌యంలో బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ వాకాటి మీద సీబీఐ కేసు కొన‌సాగుతోంది. ఇక ఇప్పుడు ఉద‌య‌గిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మీద కేసు న‌మోదుకావ‌డం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మ‌హారాష్ట్ర ఏసీబీ న‌మోదు చేసిన కేసు ప్ర‌కారం భారీగా అవ‌త‌క‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు భావిస్తున్నారు. చెక్ డ్యామ్ లు స‌హా ప‌లు నిర్మాణాల్లో నాణ్య‌త‌కు తిలోద‌కాలిచ్చి ప‌నులు చేయ‌డంతోనే క‌థ కేసుల వ‌ర‌కూ వ‌చ్చింద‌ని ప్ర‌చారం సాగుతోంది.






Related News

9173_ysrcp-3

వైసీపీ తెర‌మీద‌కు కొత్త నేత‌లు

Spread the loveవైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. రాజ‌కీయంగా జ‌గ‌న్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ల విష‌యంలోRead More

07-1457330006-28-anam-ramanarayana-reddy-600

లైన్ క్లియ‌ర్ చేస‌కున్న ఆనం

Spread the loveమాజీ మంత్రి ఆనం రామ‌నారాయణ రెడ్డికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆయ‌న వైసీపీ లో చేర‌డడం ఖాయంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *