`యుద్ధం శ‌ర‌ణం` మువీ రివ్యూ

Yuddham-Sharanam-Movie-Teaser.jpg nagachaitanya
Spread the love

నటీనటులు: నాగ‌చైత‌న్య‌, శ్రీకాంత్‌, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్‌, రేవ‌తి, ముర‌ళీశ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, ర‌వివ‌ర్మ త‌దిత‌రులు
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
ఛాయాగ్రహ‌ణం: నికేత్ బొమ్మిరెడ్డి
కూర్పు: క్రిపాక‌ర‌న్‌
నిర్మాత: ర‌జ‌నీకొర్ర‌పాటి
ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ మారిముత్తు

అక్కినేని నాగ‌చైత‌న్య ఈ ఏడాది రారండోయ్ వంటి ఫ్యామిలీ చిత్రంతో త‌న ఖాతాలో మంచి స‌క్సెస్‌నే జ‌మ చేసుకున్నాడు. ఈసారి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న థ్రిల్ల‌ర్ మూవీతో మ‌రో స‌క్సెస్ కోసం చేసిన ప్ర‌య‌త్న‌మే `యుద్ధం శ‌ర‌ణం`. నాగ‌చైత‌న్య చిన్న‌నాటి స్నేహితుడైన కృష్ణ మారిముత్తు ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డం ఒక‌ విశేషం. అయితే ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ నెగ‌టివ్ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్ చేయ‌డం మ‌రో విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేమ‌క‌థా చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న నాగ‌చైత‌న్య యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌రి నాగ‌చైత‌న్య ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింద‌నేది తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం.

క‌థ‌: ముర‌ళీ దంప‌తులు (రావు ర‌మేశ్‌, రేవ‌తి) డాక్ట‌ర్లు. సమాజ శ్రేయ‌స్సే త‌మ ల‌క్ష్యంగా ప‌నిచేస్తుంటారు. వారికి ముగ్గురు పిల్ల‌లు. ఇద్ద‌రు కుమార్తెలు. ఒక‌బ్బాయి. అబ్బాయి పేరు అర్జున్ (నాగ‌చైత‌న్య‌). అత‌ను డ్రోన్ డిజైనింగ్ చేస్తుంటాడు. శ్రీమ‌తి ముర‌ళీ ద‌గ్గ‌ర ఇంట‌ర్న్ షిప్ చేయాల‌ని వ‌చ్చిన అంజ‌లి (లావ‌ణ్య త్రిపాఠి), అర్జున్‌తో ప్రేమ‌లో ప‌డుతుంది. అంతా స‌వ్యంగా సాగుతుంద‌నగా ముర‌ళీ దంప‌తులు చ‌నిపోతారు. వారిది హ‌త్యా? ప్ర‌మాద‌మా? అనేది స‌స్పెన్స్. మ‌రోవైపు ప‌ద‌వుల‌ను ఆశించిన రాజ‌కీయ‌నాయ‌కుడు (వినోద్ కుమార్‌) న‌గ‌రంలో బాంబులు పెట్టిస్తాడు. అందుకు నాయ‌క్ (శ్రీకాంత్‌)ను వాడుకుంటాడు. ఈ బాంబ్ బ్లాస్ట్ కు, ముర‌ళీ దంప‌తులు క‌న్నుమూయ‌డానికి, నాయ‌క్‌కు, రాజ‌కీయ‌నాయకుడికి సంబంధం ఉందా? ఉంటే ఎలాంటిది? మ‌ధ్య‌లో ఎన్ ఐ ఎ అధికారి తీసుకున్న చొర‌వ ఎలాంటిది? ఇంత‌కీ సెల్వ‌మ్ ఎవ‌రు? వంటివ‌న్నీ స‌స్పెన్స్.

ప్ల‌స్
నాగ చైతన్య
ఫస్టాఫ్

మైన‌స్
రొటీన్ స్టోరీ
సెకండాఫ్
సాంగ్స్

విశ్లేష‌ణ‌

నాగ‌చైత‌న్య బాగా చేశాడు. అత‌ని ల‌వ‌ర్‌గా, లావ‌ణ్య త్రిపాఠి న‌ట‌న బావుంది. కొడుకుతో తండ్రికుండే అనుబంధం గురించి రావు ర‌మేశ్ చెప్పే మాట‌లు మెప్పిస్తాయి. చ‌దువుకున్న చ‌క్క‌టి ఇల్లాలిగా, భ‌ర్త అభిప్రాయాల‌ను గౌర‌వించే భార్య‌గా, చ‌క్క‌టి త‌ల్లిగా, స‌మాజ శ్రేయ‌స్సును కాంక్షించే వ్యక్తిగా రేవ‌తి న‌ట‌న చాలా మంచి మెప్పు పొందుతుంది. `పెళ్లి చూపులు`లో ఫ్రెండ్ కేర‌క్ట‌ర్ చేసిన ప్రియ‌ద‌ర్శి ఇందులో తెలంగాణ యాస‌లో మాట్లాడే డాక్ట‌ర్‌గా మెప్పించారు. త‌న‌కు ఇచ్చిన ప‌రిధిలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ను చ‌క్క‌గా పోషించార‌నే పేరు శ్రీకాంత్ సొంత‌మ‌వుతుంది. యాగ్రెసివ్ చూపులు, క‌ర‌కైన చేష్ట‌ల‌తో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌తో శ్రీకాంత్ ఆక‌ట్టుకున్నారు.

`యుద్ధం శ‌ర‌ణం` అనే టైటిల్ పెట్ట‌డం, చాన్నాళ్ల త‌ర్వాత శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించ‌డం వారాహి వంటి సంస్థ నిర్మించ‌డంతో `యుద్ధం శ‌ర‌ణం` సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది. దానికి తోడు నాగ‌చైత‌న్య పెళ్లికి ముందు విడుద‌ల‌వుతున్న ఆఖ‌రి చిత్రం కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మంచి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ను, అందమైన ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఫ్యామిలీని మ‌రింత అందంగా చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు కృత‌కృత్యుడ‌య్యాడు. ఎటొచ్చీ సెకండాఫ్‌లో ఎమోష‌న్స్ స‌రిగా పండ‌లేద‌నిపించింది. మాఫియాను, రాజ‌కీయ‌నాయ‌కుల‌ను సైతం గ‌డ‌గ‌డ‌లాడించే డాన్‌ను ఓ పాతికేళ్ల కుర్రాడు అంత తేలిగ్గా ఎలా ట్రాప్‌చేయ‌గలిగాడ‌న్న‌ది మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారం. ముర‌ళీశ‌ర్మ పాత్ర అక్క‌డ‌క్క‌డా రిలీఫ్‌గా అనిపించింది. ర‌వివ‌ర్మ క‌నిపించిన‌ప్పుడ‌ల్లా విల‌న్ బ్యాచ్‌కి కోవ‌ర్ట్ గా ప‌నిచేస్తున్నాడేమోన‌నే స‌స్పెన్స్ సాగుతుంది. మొత్తానికి `యుద్ధం శ‌ర‌ణం` ఒక రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం.

రేటింగ్‌: 2.5/5
పంచ్ లైన్‌: రొటీన్ మువీనే


Related News

mahesh bharath ane nenu

‘భ‌ర‌త్ అనే నేను’ మువీ రివ్యూ

Spread the loveసినిమా: భ‌ర‌త్ అనే నేను తారాగ‌ణం: మ‌హేశ్‌, కైరా అద్వాని, ప్ర‌కాశ్‌రాజ్‌, శ‌ర‌త్ కుమార్‌, బ్ర‌హ్మాజీ, రావుRead More

svTAHjnc

‘రంగ‌స్థ‌లం’ మువీ రివ్యూ

Spread the loveసినిమా: రంగ‌స్థ‌లం న‌టీన‌టులు: రామ్ చ‌ర‌ణ్, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు, ఆదిపినిశెట్టి, ప్ర‌కాష్ రాజ్, అన‌సూయ త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ:Read More

 • రంగ‌స్థ‌లం ఫ‌స్ట్ రివ్యూ, రేటింగ్!
 • ఏం మంత్రం వేశావే…మువీ రివ్యూ
 • విక్ర‌మ్ ‘స్కెచ్’ ఫ‌లించిందా? మువీ రివ్యూ
 • ఆ సినిమా మువీ రివ్యూ
 • టచ్ చేసి చూడు మువీ రివ్యూ
 • అజ్ణాతవాసి మువీ రివ్యూ
 • సప్తగిరి మువీ రివ్యూ
 • జవాన్ మువీ రివ్యూ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *