Main Menu

విక్ర‌మ్ ‘స్కెచ్’ ఫ‌లించిందా? మువీ రివ్యూ

Spread the love

సినిమా : స్కెచ్
తారాగ‌ణం: విక్ర‌మ్‌, త‌మ‌న్నా, సూరి, బాబూరాజ్‌, ఆర్‌.కె.సురేష్‌, శ్రీమాన్ త‌దిత‌రులు
సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌
నిర్మాణం: మూవింగ్ ఫ్రేమ్
ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ చంద‌ర్‌

విక్ర‌మ్ కి టాలీవుడ్ లో కూడా విశేషంగా ఫ్యాన్స్ ఉన్నారు. విభిన్న చిత్రాల న‌టుడిగా పేరుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే కొన్ని సినిమాలు భారీ హిట్స్ కొట్టాయి. దాంతో విక్ర‌మ్ మార్కెట్ కి త‌గ్గ‌ట్టుగా అత‌డి సినిమాల‌ను టాలీవుడ్ ముందుకు తీసుకొస్తుంటారు. ఫ్యాన్స్ ఎగ‌బ‌డుతుంటారు. ఇకి తాజాగా స్కెచ్ పేరుతో కొత్త‌ద‌నంతో నిండిన క‌థ‌నం వండి వార్చార‌నే ప్ర‌చారం సాగింది. విక్ర‌మ్ మార్క్ మువీగా చెప్పుకొచ్చారు. మ‌రి నిజంగా స్కెచ్ ఫ‌లించిందా…ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందా…ఈ రివ్యూలో చూద్దాం..

క‌థ‌:
స్కెచ్‌(విక్ర‌మ్‌)కి కుటుంబం ఉన్నా, మేన‌మామతో ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల్ల మాస్‌గా త‌యార‌వుతాడు. లోన్‌పై వెహిక‌ల్స్ తీసుకుని వ‌డ్డీ క‌ట్ట‌నివారి వాహ‌నాల‌ను స్కెచ్ వేసి తీసుకొచ్చే గ్యాంగ్‌లీడ‌ర్‌గా ఉండే స్కెచ్ మేన‌మామ‌కు ఓ కార‌ణంగా చేయి పోతుంది. దాంతో సేఠ్ ద‌గ్గ‌ర ప‌నికి చేరుతాడు స్కెచ్‌. సేఠ్ కూడా స్కెచ్‌పై న‌మ్మ‌కంతో బాధ్య‌త‌ల‌ను అత‌నికే అప్ప‌చెబుతాడు. ఊర్లోనే పేరు మోసిన రౌడీ కుమార్‌, సేఠ్ బండిని కొట్టేసి వ‌డ్డీ క‌ట్ట‌కుండా తిరుగుతుంటాడు. ఈ విష‌యం తెలుసుకున్న స్కెచ్ ప్లాన్ వేసి ఆ కారుని త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేలా చేసుకుని కుమార్‌ని ఇబ్బంది పెడ‌తాడు. దాంతో కుమార్ స్కెచ్ అండ్ గ్యాంగ్‌పై ప‌గ‌బ‌ట్టి..స్కెచ్‌ని, అత‌ని స్నేహితుల‌ను లేపేస్తాన‌ని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు స్కెచ్ ఏం చేస్తాడు? కుమార్ స్కెచ్ అండ్ గ్యాంగ్‌పై గెలుస్తాడా? లేదా? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేసిన విక్ర‌మ్‌కు స్కెచ్ పాత్ర చేయ‌డం చాలా సులువు అని సినిమా చూసే ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది. మాస్ బ్యాక్ డ్రాప్‌లో విక్ర‌మ్ త‌న పాత్ర‌ను చాలా సింపుల్‌గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. అలాగే త‌మ‌న్నా వెంట‌ప‌డే స‌న్నివేశాలు, ప్రేమించే స‌న్నివేశాలు ఇలా అన్నింటిని సుల‌భంగా చేసేశాడు. ఇక అమృత పాత్ర‌లో త‌మ‌న్నా పాత్ర‌కు న్యాయం చేసింది. ఈ పాత్ర ప‌రిధి మేర త‌మ‌న్నా న‌టించింది. పాత్ర‌కు క‌థ ప‌రంగా పెద్ద‌గా స్కోప్ లేదు. సినిమా ఫ‌స్టాఫ్ అంతా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. పాత్ర‌ల పరిచ‌యం హీరోయిజంతో ఫ‌స్టాప్ స‌రిపోతుంది. ఇక సెకండాఫ్‌లోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. హీరో గ్యాంగ్‌ను విల‌న్ చంపేస్తాన‌న‌డం.. అన్న‌ట్లుగానే అంద‌రూ చ‌నిపోతుండ‌టం .. హీరో అస‌లు ఎవ‌రు? ఎలా చంపుతున్నారో తెలియ‌క పోవ‌డం. అస‌లు కార‌ణం తెలియ‌గానే షాక్ అవ‌డం ఈ పాయింట్స్ అన్ని కాస్త ఆస‌క్తిని రేపుతాయి. ద‌ర్శ‌కుడు విజ‌య్ నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో రాసుకున్న క‌థ ఇది. దీన్ని తెలుగులో విడుద‌ల చేయాలంటే.. హ‌క్కుల‌ను ఇక్క‌డ కొనాల‌న్నా నిర్మాత‌లు ఆలోచిస్తారు. ఎందుకంటే క‌థ తెర‌కెక్కిన నేప‌థ్యం ఇక్క‌డ మ‌న‌కు క‌న‌ప‌డ‌దు కాబ‌ట్టి.. ఆ నేప‌థ్యంలో వ‌చ్చే క‌థ‌లు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాదు. త‌మిళం ప్ర‌కారం చూసినా అక్క‌డ ఇలాంటి క‌థ‌లు చాలానే వ‌చ్చాయి. విక్ర‌మ్ ఇమేజ్‌కి ఈ క‌థ చిన్న‌దై పోయింది. త‌మ‌న్ అందించిన ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాలో హీరో, హీరోయిన్ ల‌వ్ ట్రాక్‌కు సంబంధం లేకుండా ఉంది. సుకుమార్ సినిమాటోగ్ర‌పీ బావుంది.

చివ‌ర‌గా.. ఫెయిల్డ్ స్కెచ్
updatea ap రేటింగ్ : 2/5


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *