Main Menu

టచ్ చేసి చూడు మువీ రివ్యూ

Spread the love

సినిమా: టచ్ చేసి చూడు
తారాగ‌ణం: ర‌వితేజ‌, రాశిఖ‌న్నా, సీర‌త్‌క‌పూర్‌, ఫ్రెడ్డీ దారువాలా, ముర‌ళీశ‌ర్మ‌, స‌త్యం రాజేష్‌, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు
మ్యూజిక్: జామ్ 8
సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌, ఛోటా కె.నాయుడు
క‌థ‌: వ‌క్కంతం వంశీ
నిర్మాత‌లు: న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంవీ
ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్ సిరికొండ‌

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ఇటీవలే మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. `రాజా ది గ్రేట్‌`తో స‌క్సెస్ కొట్టారు. వెంటనే `ట‌చ్ చేసి చూడు` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. దాంతో ఫ్యాన్స్ లో సందడి కనిపించింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మరి ఈ `ట‌చ్ చేసి చూడు`లో ర‌వితేజ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అని తెలియాలంటే ఈ రివ్యూ చదవండి…

క‌థః
పాండిచ్చేరిలో నివ‌సించే కార్తికేయ ఇండ‌స్ట్రీస్ అధినేత కార్తికేయ (ర‌వితేజ‌) కి కుటుంబం అంటే చాలా ప్రేమ‌. కుంటుంబానికి చెడ్డ పేరు తెచ్చే ఏ ప‌ని చేయ‌కూడ‌ద‌ని అనుకునే స్వ‌భావం ఉన్న వ్య‌క్తి. ర‌వితేజ తండ్రి( జ‌య‌ప్ర‌కాష్‌)కి కొడుకు పెళ్లి చేసుకోవ‌డం లేద‌నే బాధ ఉంటుంది. తండ్రి బాధ‌ను చూడ‌లేక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ర‌వితేజ‌. అందుకోసం పుష్ప‌(రాశిఖ‌న్నా)ను పెళ్లి చూపుల్లో చూస్తాడు. లేడీస్‌తో ఎలా మాట్లాడాలో తెలియ‌ని కార్తికేయ, పుష్ప‌ను రెండు సార్లు హ‌ర్ట్ చేస్తాడు. దాంతో పుష్ప.. కార్తికేయ‌ను పెళ్లి చేసుకోన‌ని చెబుతుంది కానీ ఆమెకు కార్తికేయ అంటే ప్రేమ ఉంటుంది. ఆ ఇష్టం కార‌ణంగానే అత‌నికి వేరే అమ్మాయితో జరిగే పెళ్లి సంబంధాన్ని కూడా అడ్డుకుంటుంది. ఒకానొక సంద‌ర్భంలో ఆ విష‌యం తెలిసిన కార్తికేయ ఆమెతో పెళ్లిని నిరాక‌రిస్తాడు. మ‌రోవైపు కార్తీకేయ కంపెనీకి వ‌చ్చే మిష‌న‌రీస్‌ను సెల్వమ్ అనే గూండా లాక్కెళ్లిపోతాడు.

ఈ విష‌య‌మై కార్తికేయ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చినా ప‌ట్టించుకోరు. రెండు నిమిషాల్లో స‌మ‌స్య‌ను క్లియ‌ర్ చేయ‌వ‌చ్చునని.. కానీ పోలీసులు స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటాడు కార్తికేయ‌. దాంతో స్థానిక సీఐకి కోపం వ‌స్తుంది. కార్తికేయ‌కు రెండు నిమిషాల స‌మ‌యం ఇచ్చి స‌మ‌స్య‌ను తీర్చుకోమంటాడు. కార్తికేయ ప‌వ‌ర్ ఏంటో అక్క‌డ తెలుస్తుంది. అదే స‌మ‌యంలో కార్తికేయ కంపెనీలో ప‌నిచేసే వ్య‌క్తి త‌న‌యుడు స‌త్య‌ను ఎవ‌రో హత్య చేస్తారు. ఆ హ‌త్య‌ను కార్తికేయ చెల్లెలు చూసి త‌న అన్న‌కు చెబుతుంది. నేరం చేసిన వ్య‌క్తిని ఇర్ఫాన్ లాలా గా గుర్తిస్తుంది. అప్ప‌టికే చ‌నిపోయిన ఇర్ఫాన్ ఎలా తిరిగి వ‌చ్చాడు? గ‌తంలో కార్తికేయ‌కు, ఇర్ఫాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఇర్ఫాన్ చ‌నిపోయాడ‌ని క‌మిష‌న‌ర్ (ముర‌ళీశ‌ర్మ‌) ఎందుకు కార్తికేయ‌కు అబద్ధం చెప్పాడు? ముజ‌ఫ‌ర్ పేట గొడ‌వ‌లు ఏంటి? అక్క‌డ లాలా ఎవ‌రు? గ‌తంలో నిశ్చితార్థం వ‌ర‌కు వ‌చ్చిన కార్తికేయ పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? అత‌న్ని అంత‌గా ఇష్ట‌ప‌డ్డ దివ్య (సీర‌త్ క‌పూర్‌) ఎందుకు అత‌న్ని వ‌ద్ద‌నుకుంటుంది? అనే విష‌యాలు ఆస‌క్తిక‌రం.

ప్లస్:
– ర‌వితేజ
– యాక్ష‌న్ పార్ట్‌

మైనస్:
– రొటీన్ స్టోరీ
– కథనంలో

నటీనటులు

సహజంగానే రవితేజ బ్రాండ్ సినిమాగా కనిపిస్తుంది. గతంలోనే పోలీస్ ఆఫీసర్ గా విక్రమార్కుడు వంటి సినిమాల్లో మెప్పించిన రవితేజ క్యారెక్టర్ లో పవర్ వంటి సినిమాల ఆనవాళ్లు కనిపిస్తాయి. పెర్ఫామెన్స్ ప‌రంగా ర‌వితేజ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ, ఎన‌ర్జీతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ ఒదిగిపోయారు. ఇక హీరోయిన్స్ రాశీ ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్‌ల పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. ఓవ‌ర్ గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారిద్ద‌రూ. ముర‌ళీశ‌ర్మ‌, షాయాజీ షిండే, విల‌న్‌గా న‌టించిన ఫ్రిడే, ర‌వితేజ స్నేహితుడిగా న‌టించిన స‌త్యం రాజేష్, తండ్రి పాత్ర‌లో న‌టించిన జ‌యప్ర‌కాష్ ఇలా అంద‌రూ త‌మదైన న‌ట‌న‌తో వారి వారి పాత్ర‌ల్లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

విశ్లేష‌ణ‌:

పూర్తిగా రొటీన్ సినిమాగా మారిపోయింది. రవితేజ ఫ్యాన్స్ ని సంత్రుప్తి పరిచినా కనీసం మ్యూజిక్ కూడా మెప్పించలేకపోయారు. దర్శకుడు కూడా అనేక జాగ్రత్తలు తీసుకుని ఉంటే కొంత ఫర్వాలేదనిపించేది. దానికి భిన్నంగా సాగడంతో సాధారణ సినిమాగా మిగిలిపోయింది.

పంచ్ లైన్ .. రవితేజ ఫార్మేట్ మూవీ
రేటింగ్ : 2.5/5


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *